ఖానాపురం : మండలకేంద్రం శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం రాత్రి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే గూడూరు వైపు నుంచి వస్తున్న ఆటోలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఖానాపురం శివారులో అనుమానస్పదంగా వెళుతున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్న నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.