వరంగల్ అర్బన్ : నిషేధిత నల్లబెల్లం అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధి భీమదేవరపల్లి కొత్తకొండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందం వ్యాపారి కె. అనిల్ కుమార్ ఇంటిపై రైడ్ చేశారు. రూ.46,800 విలువ గల 1040 కేజీల నల్లబెల్లాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ముల్కనూరు పోలీసులకు అప్పగించారు.