గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 14, 2020 , 00:06:48

మంత్రి కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్‌ వివరాలు

మంత్రి కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్‌ వివరాలు

హన్మకొండ : రాష్ట్ర  ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 17 వరంగల్‌కు రానున్న నేపథ్యంలో పర్యటన వివరాలను జిల్లా యంత్రాంగం శనివారం వెల్లడించింది.  

 • 17న ఉదయం 10గంటలకు రాంపూర్‌కు చేరుకుని 10:30 గంటలకు ఆక్సిజన్‌ పార్కు నిర్మాణం, కరీంనగర్‌, ఖమ్మం, నర్సంపేట, హైదరాబాద్‌ రోడ్ల ముఖ ద్వారాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 
 • 10:50కి కాజీపేట-కడిపికొండ బ్రిడ్జి వద్దకు చేరుకుని 11గంటలకు మడికొండలో నిర్మించనున్న 200 టూబీ హెచ్‌కె, కాజీపేటలో నిర్మించనున్న 97 టూబీహెచ్‌కె  ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 
 • 11:15 గంటలకు హన్మకొండ బాలసముంద్రంలోని అంబేద్కర్‌నగర్‌కు చేరుకుని 11.45గంటలకు 592 టూబీహెచ్‌కె ఇళ్ల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. 
 • మధ్యాహ్నం 12:10కు వరంగల్‌ బట్టల బజార్‌కు చేరుకుని 12:15గంటలకు ఆర్‌వోబీ ప్రారంభించి, ఇన్నర్‌ రింగురోడ్డు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 
 • 12:30గంటలకు గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ వద్ద పోతన జంక్షన్‌ను 12:35కి  ప్రారంభిస్తారు. 
 • 12:45 గంటలకు సెంట్రల్‌ జైలుకు చేరుకుని 1.15 వరకు కుడా ఆధ్వర్యంలోని నర్సరీని సందర్శిస్తారు. 
 • మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహారి ఇంట్లో భోజనం చేస్తారు. 
 • 2:30 నుంచి 4:30 వరకు హన్మకొండ నందనా గార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిథులతో సమీక్షిస్తారు. 
 • అనంతరం అక్కడే 4:30 నుంచి 5 గంటల వరకు విలేకరులతో మాట్లాడుతారు. 
 • సాయంత్రం 5:15 నుంచి 6గంటల వరకు ప్రశాంత్‌నగర్‌లోని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంట్లో టీ పార్టీకి హాజరవుతారు. 
 • సాయంత్రం 6:15 గంటలకు భద్రకాళీ బండ్‌కు చేరుకొని 7:30 వరకు రెండో విడత బండ్‌ నిర్మాణ పనులకు శంక స్థాన చేయడంతో పాటు కుడా ఆధ్వర్యంలో నిర్మించిన భద్రకాళీ బండ్‌ను ప్రారంభిస్తారు. 


logo