థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతోంది. టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలోకి రావడంతో మొబైల్ ఓటీటీదే హవా నడుస్తోంది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఫోన్లోనే చూసుకునే వీలు దొరికింది. అంతేకాదు బిగ్ స్క్రీన్‌తో హోం థియేటర్లు రావడంతో ఇల్లే సినిమా హాల్‌గా మారింది. ఇంకేముంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంచక్కా నచ్చిన మూవీస్, వెబ్‌సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేసే వెసులుబాటు ఉండడంతో నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వరంగల్‌లో వీటి విక్రయాలు పెరుగగా, కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఖర్చుకు వెనుకాడకుండా ప్రత్యేకంగా హాల్‌ను నిర్మించుకోవడం విశేషం. – హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 5
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 5 : థియేటర్‌కు వెళ్లి రెండున్నర గంటల సినిమా చూడాలంటే రెడీ కావడానికి గంట, అక్కడికి చేరుకోవడానికి మరో అరగంట.. ఇలా నాలుగు గంటలు పోయినట్టే.. పైగా ఇంటిల్లిపాది థియేటర్‌కు వెళ్తే అయ్యే ఖర్చు రెండు వేల రూపాయల పైమాటే. కానీ ఇప్పుడు ఇల్లే సినిమా హాల్‌గా మారిపోతోంది. థియేటర్లు ఏకంగా ఇంట్లోకి నడిచి వచ్చేశాయి. ఇదంతా కాలం తెచ్చిన మార్పు. ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే అందులో పెద్దగా హాల్ ఉండేది. ఇప్పుడు అదే హాలు హోం థియేటర్‌గా మారుతోంది. కొత్త ఇల్లు కట్టుకునే వారంతా చక్కటి థియేటర్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. 10-12 సీట్లతో థియేటర్లు ఏర్పాటవుతున్నాయి. అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే వారు కూడా అందులో ఓ థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు అంటే సినిమా ఇంటికే వచ్చేసిందన్నమాట. కరోనా కర్కశత్వం ఓటీటీకి వరంగా మారడంతో ఎప్పుడో రావాల్సిన మార్పు కాస్తంత ముందుగానే వచ్చింది. ఇప్పుడు వినోదరంగంలో ఓటీటీదే హవా. ఓటీటీ తర్వాత ఇంట్లోనే ఉండే రోజులు వచ్చేశాయి.
ఇంట్లోనే థియేటర్ ఉండాలన్న ఆలోచన సినిమా వారి నుంచే మొదలైంది. తొలుత అగ్రహీరోలంతా తమ ఇళ్లల్లోనే మినీ థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వారందరికీ సొంత థియేటర్లు కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రొజెక్టర్లతో థియేటర్లలో చూసిన అనుభూతిని ఈ హోం థియేటర్లను అందిస్తున్నాయి. రూ.3 లక్షల నుంచి రూ.80 లక్షల వ్యయంతో ఇవి అందుబాటులో ఉన్నాయి. హీరో మహేశ్‌బాబు సైతం ఇంట్లోనే నిర్మించుకున్న థియేటర్లో సినిమా వీక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం.
సినిమా సెలబ్రిటీలకే పరిమితమైన ఈ థియేటర్లు ఇప్పుడు సామాన్యుల ఇళ్లకు కూడా వచ్చేస్తున్నాయి. తమ స్థోమతను బట్టి థియేటర్లు ఏర్పా టు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సైజ్ ఎల్ఈడీ టీవీలు, 8కే టీవీలు దాదాపు థియేటర్ అనుభూతిని అందిస్తున్నాయి. అయితే వీటిని ఇప్పుడు పేదలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఓ మాదిరి మధ్యతరగతి వారు కూడా థియేటర్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీవీల తయారీ కన్నా థియేటర్ అనుభూతిని తామే అందించే ఏర్పాటు మీద టీవీ కంపెనీలు కూడా దృష్టిపెట్టాయి. టీవీల స్థానాన్ని ప్రొజెక్టర్లు భర్తీ చేస్తున్నాయి.
సౌండ్ ఎఫెక్ట్స్ కూడా థియేటర్ అనుభూతికి ఏమీ తక్కువ ఉండడం లేదు. ఈ పరిణామం సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. భారీ చిత్రాల నిర్మాణానికి చరమగీతం పడవచ్చు. ఏయే రంగాల మీద ఈ ప్రభావం పడబోతుందో చూడాలి. రానున్న రెండు మూడేళ్లలో వినోదరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మెట్రో నగరాల తరహాలో హోం థియేటర్లు చేయించుకుంటున్నారు. మనం అనుకున్న బడ్జెట్లో మంచి థియేటర్ చేసి ఇస్తున్నా రు. మనకు కావాల్సిన విధంగా హోంథియేటర్ రూపొందించి ఇస్తారు. సన్‌టెక్ ఏవీ సొల్యూషన్స్ వద్ద ఆడియోలో మంచి అనుభవం ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు. ఆడియో, వీడియో ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీసు కూడా బాగుంది. ఇప్పుడు ఇంట్లోనే థియేటర్ కామన్ అయిపోయింది. రీసెంట్గా మేం హోం థియేటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఫ్రీటైంలో విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఇంట్లోనే హ్యాపీగా సినిమా చూడొచ్చు.
– పి.శ్రీకాంత్, వరంగల్
హోం థియేటర్ చేయించుకునేవారు హైదరాబాద్, బెంగళూరు, ముంబైకి వెళ్లాల్సినసరం లేదు. ఇప్పుడు మన వరంగల్‌లోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో ఎక్కడైనా సరే సరైన సమయంలో హోం థియేటర్ సెట్ చేసి ఇస్తున్నాం. కస్టమర్ రూం సైజ్‌ను బట్టి స్క్రీన్స్, ఆడియో ఇన్స్టాల్, ఫ్లాట్ ఫిక్స్డ్ ఫ్రేమ్, కర్వుడ్ ఫిక్స్డ్ ఫ్రేమ్, స్క్రీన్స్ చేస్తున్నాం. రూ.3 నుంచి రూ.80 లక్షల వరకు హోం థియేటర్స్ చేయొచ్చు.. ఒక రూమును మాకు అప్పగిస్తే మీకు నచ్చినవిధంగా థియేటర్ ఏర్పాటు చేస్తాం. సోనీ, బెన్క్యూ, వ్యూసోనిక్, టర్బోసౌండ్, జేబీఎల్, బోస్, బ్లాక్ అండ్ వైట్, డెనాన్, యమహా వంటి ప్రముఖ కంపెనీలతో రూపొందిస్తున్నాం. హనుమకొండ సుబేదారిలోని స్పెన్సర్స్ పక్కన ఉన్న లోయల్ ఆక్రేడ్ వద్ద కస్టమర్ల సౌకర్యార్థం డెమో రూం కూడా ఏర్పాటుచేశాం. జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటివరకు మొత్తం 16మందికి హోం థియేటర్లు ఏర్పాటు చేశాం.
– అమ్మ రమేశ్, సన్‌టెక్ ఏవీ సొల్యూషన్స్ ప్రొప్రైటర్, సుబేదారి, హనుమకొండ