నల్లగొండ : జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోన్నది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 529.40 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 166 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,464 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 959 క్యూసెక్కులుగా ఉంది.