ప్రతి రోజూ.. ఇంటికీ

- తాగునీరు సరఫరా కోసం అధికారుల కసరత్తు
- ఫిల్టర్ బెడ్ల ఆధునీకరణ పనుల్లో వేగం
- దశాబ్దాల కాలం నాటి ఫిల్టర్లు వినియోగంలోకి..
- 200 మంది అదనపు సిబ్బంది నియామకం
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇంటింటికీ రోజూ తాగునీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని గ్రేటర్ అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఉగాది కానుకగా ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు నగరంలో మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు శ్రమిస్తున్నారు.
- వరంగల్, ఫిబ్రవరి 22
నగరంలో ప్రతి రోజూ ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు గ్రేటర్ అధికారులు ఫిల్టర్ బెడ్ల ఆధునీకరణ పనులు చేపట్టారు. నెల రోజులుగా నగరంలోని మూడు ఫిల్టర్ బెడ్లలో ఉన్న తొమ్మిది ఫిల్టర్ యూనిట్లను ఆధునీకరించే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలం నుంచి వినియోగించకుండా ఉంచిన ఫిల్టర్ యూనిట్లను మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇంటింటికీ తాగునీరు సరఫరా కార్యానికి అదనపు సిబ్బందిని సైతం నియమించారు. ఆరంభ శూరత్వం కాకుండా పటిష్ట ప్రణాళికలతో గ్రేటర్ అధికారులు అడుగులు వేస్తున్నారు.
అదనపు సిబ్బంది..
ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా చేసే క్రమంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే తాగునీటి సరఫరాలో పనిచేసేందుకు 200 మంది స్కిల్డ్ కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. తాగునీటి సరఫరాలో కీలకంగా పనిచేసే లైన్‌మన్లతో పాటు ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్ ఆపరేటర్లు, పంపు ఆపరేటర్లు, కెమిస్ట్‌లను నియమించారు. ఎక్కడైనా లీకేజీలు తలెత్తితే వెంటనే మరమ్మతు చేసేలా ప్రత్యేక కార్మికులను సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో గ్రేటర్ అధికారులు ఉన్నారు. ఉగాది నుంచి ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించడంతో గ్రేటర్ అధికారులు అదే లక్ష్యంతో ముందుకు పోతున్నారు.
తాజావార్తలు
- గెలుపు ముఖ్యం.. రోజులు కాదు.. క్రిటిక్స్‌పై కోహ్లీ
- ఆయన వస్తే మార్పులేం ఉండవు.. వైస్సార్సీపీలోకి గంటా రాకపై విజయ్ సాయి
- నా పేరే..సారంగ దరియా!
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!