చిన్నారులకు హెల్త్ కార్డులు

- 22 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్
- పిల్లల ఎత్తు, బరువు, పొడవు తదితర వివరాల సేకరణ
- బాలురకు నీలిరంగు, బాలికలకు గులాబీ రంగు కార్డులు
- ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తి
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి హెల్త్ ప్రొఫైల్ ఆధారంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారి ఎత్తు, బరువు, పొ డవు తదితర ఆరోగ్య వివరాలను సేకరించి, బాలురకు నీలిరంగు, బాలికలకు గులాబీ రంగు కార్డులు ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
- హన్మకొండ, ఫిబ్రవరి 20
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేస్తున్నది. లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నది. ఇప్పటికే పోషణ వారోత్సవాలు, నూట్రీగార్డెన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు వచ్చే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. వారిలో లోప పోషణ లేకుండా బలిష్టంగా తయారు చేసేందుకు కార్యాచణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చిన్నారుల హెల్త్‌ప్రొఫైల్ తయారు చేసి దాని ఆధారంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఇప్పటికే సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా పిల్లల ఆరోగ్య స్థితి గతుల వివరాలు సేకరించి, మార్చి నెలలో కార్డులు జారీ చేసేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాలురకు నీలిరంగు, బాలికలకు గులాబీ రంగులో ఉండే ఆరోగ్య కార్డులు జారీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. వారం రోజుల పాటు 0 నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లల ఎత్తు, బరువు, పొడవు తదితర వివరాలను సేకరిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లకు యంత్రాలను అందజేశారు. ఎత్తు కొలిచేందుకు స్టేడియో మీటర్, బరువు కొలిచేందుకు సాల్టర్ స్కేల్, పొడవు కొలిచేందుకు ఇన్ప్రాంటో మీటర్ పరికరాలను వినియోగిస్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రతి రోజూ పది మంది చిన్నారుల వివరాలు సేకరించి, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్‌హెచ్‌టీఎస్) ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తారు. అనంతరం అంగన్వాడీల్లోని చిన్నారులకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు.
అర్బన్ జిల్లాలో 52,066 మంది చిన్నారులు
వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ అర్బన్, వరంగల్ అర్బన్, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలో మినీ, ప్ర ధాన అంగన్వాడీ సెంటర్లు 799 ఉన్నాయి. ఐసీడీఎస్ అధికారుల వివరాల ప్రకారం.. ఈ సెంటర్లలో 0 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు 52,066 మంది ఉన్నారు. వీరందరి ఎత్తు, బరువు, పొడవు కొలిచి వివరాలు వెబ్సైట్లో నమోదు చేయనున్నారు.
ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేయాలి
లోప పోషణ నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యే క డ్రైవ్‌ను విజయవంతం చేయాలి. 22 నుంచి నెలాఖరు వరకు వారం రోజుల పాటు అంగన్వాడీ సెంటర్లలో 0 నుంచి 5 సంవత్సరాల మ ధ్య వయస్సున్న చిన్నారుల వివరాలు సేకరిస్తారు. ముఖ్యంగా బరు వు, ఎత్తు, పొడవు వివరాలు సేకరించి వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కూడా పూర్తయింది.
- కే మధురిమ, సీడీపీవో, హన్మకొండ అర్బన్ ప్రాజెక్టు
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!