ఘనంగా శివాజీ జయంతి

కాజీపేట, ఫిబ్రవరి 19: పట్టణంలోని 52వ డివిజన్ విష్ణుపురిలో శుక్రవారం చత్రపతి శివాజీ జయంతి వేడుకలను హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ జక్కుల రమారవీందర్ యాదవ్ శివాజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భరత మాత ముద్దుబిడ్డ స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు శివాజీ అని కొనియాడారు. అనంతరం అన్నదానం చేశారు. హనుమాన్ సేవా సమితి సభ్యులు భరత్, యాసిన్, చిన్న పాల్గొన్నారు.
భీమారంలో శివాజీకి నివాళి
భీమారం: ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 జయంతి వేడుకలను గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం నిర్వహించారు. హనుమాన్‌నగర్ జంక్షన్లో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు దూలం రాంబా బు, సారంగం, శ్రీనివాస్‌రెడ్డి, సాదుల రఘుపతి, మొట్ల రాజ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మర్కజీ సెంటర్లో..
హన్మకొండ సిటీ: హన్మకొండ ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల సెంటర్, న్యూ లయోలా హైస్కూల్లో కొత్తూర్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సుప్రజ, అలేఖ్య, కార్తీక్, రాజేశ్వర్‌రావు, నలుబొల అమర్, దేవేందర్, లక్ష్మణ్, రఘువీర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!