శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Feb 19, 2021 , 02:49:25

సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలి

సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలి

కాజీపేట, ఫిబ్రవరి 18: టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని పార్టీ పట్టణ ఇన్‌చార్జి సుందర్‌రాజ్‌ అన్నారు. కాజీపేట పట్టణం 52వ డివిజన్‌ సోమిడిలో డివిజన్‌ అధ్యక్షుడు సుంచు రఘురాం ఆధ్వర్యంలో గురువారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..కాజీపేట పట్టణంలో అత్యధిక సభ్యత్వాలు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించి స్వచ్ఛందంగా పాల్గొనేలా కృషి చేయాలన్నారు. నాయకులు సుంచు కృష్ణ, కాటాపురం రాజు, సుంచు అశోక్‌, పాలడుగుల శివకుమార్‌, అయ్యాల దానం,  బస్వ యాదగిరి, రామస్వామి, రాజేందర్‌, రఘు, తేలు సారంగపాణి, వెనిశెట్టి రఘు, మల్లేశ్‌, రాకేశ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, సరోజన, యాకూబీ, విజయ పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు ఉద్యమంలా చేపట్టాలి

భీమారం: టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఉద్యమంలా చేపట్టాలని గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 57వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం హనుమాన్‌నగర్‌ జంక్షన్‌, సాయి నగర్‌కాలనీ, హనుమాన్‌నగర్‌ కాలనీల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదుగుతోందన్నారు. కార్యక్రమంలో మొట్ల మనోహర్‌, వలస సారంగం, దార బుచ్చిరాజం, సాదుల రఘుపతి, ముత్తినేని రమేశ్‌, సంతోశ్‌, వెంకటేశ్‌, ఉదయ్‌ కిరణ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కార్యకర్తలు భాగస్వాములు కావాలి

మడికొండ: టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని గ్రేటర్‌ వరంగల్‌ 34వ డివిజన్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి సుందర్‌రాజ్‌ అన్నారు. గురువారం డివిజన్‌లో కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌ అధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.   తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తండమల్ల వేణు, మర్యాల కృష్ణ, రామ్మోహన్‌, కనకరాజు, శ్రీనివాస్‌, విజయ్‌భాస్కర్‌, టింకు తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo