శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Feb 19, 2021 , 02:49:25

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

మట్టెవాడ, ఫిబ్రవరి 18 : నగరంలోని బాలానగర శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి, శ్రీసుదర్శన నారసింహాఇష్టి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం హంస వాహన సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో శేషగిరి, వంశపారంపర్య ధర్మకర్త పరాశరం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు, సేవాసమితి ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత  వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు.

VIDEOS

logo