సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 19, 2021 , 02:49:25

నేడు కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌

నేడు కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌

సుబేదారి, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్వీ, కాకతీయ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ చివరిదశకు చేరింది. శుక్రవారం 37వ డివిజన్‌ వర్సెస్‌ 42వ డివిజన్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు   టీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మ్యాచ్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ట్రోఫీ, ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, శుక్రవారం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మీడియా, కార్పొరేటర్ల జట్లతో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. 

VIDEOS

logo