ఊరూరా వృక్షార్చన

- సీఎం కేసీఆర్‌కు ప్రజానీకం వన కానుక
- పండుగలా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుక
- ఉమ్మడి జిల్లాలో పెద్దసంఖ్యలో పాదుకున్న మొక్కలు
- పల్లె, పట్టణం తేడా లేకుండా పాలుపంచుకున్న ప్రజలు
- టీఆర్ఎస్, వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు
- ఉత్సాహంగా మొక్కలు నాటిన సబ్బండవర్గాలు
వనహిత నేతకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం వృక్షార్చన చేసి గుండెలనిండా ఉన్న అభిమానాన్ని చాటుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం లక్షలాది మొక్కలు నాటి చిరుకానుకనందించింది. ఊరూవాడా, పల్లె, పట్నం తేడాలేకుండా జననేత జన్మదిన వేడుకలు కనులపండులా జరిగాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, యువజన, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యాపారులు ఇలా ఒక్కరేమిటి సబ్బండవర్గాల భాగస్వామ్యంతో ‘కోటి వృక్షార్చన’ విజయవంతమైంది. ఒక్కొక్కరుగా.. సమూహంగా నాటిన మొక్కలతో ప్రతి పల్లెలో ‘హరితో’దయం ఆవిష్కృతమైంది.
వరంగల్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సాధకుడు.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత.. బంగారు తెలంగాణ సారథి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుడమి పచ్చదనంతో నిండి పోయింది. ఊరూవాడ, పల్లె, పట్నం తేడా లేకుండా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ ఉమ్మడి జిల్లాలో విజయవంతమైంది. సబ్బండవర్గాలవారు ఉత్సాహం గా మొక్కలు నాటి జనహృదయ నేత కేసీఆర్‌పై తమ అభిమా నాన్ని చాటుకున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యుతు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, వాణిజ్య వర్గాలవారు, సింగరేణి అధికారులు, సిబ్బంది. ఇలా అన్ని వర్గాల వారు మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుక ఇచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ‘కోటి వృక్షార్చన’కు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో విశేష స్పందన వచ్చింది. ప్రతి ఊరిలోనూ ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటడం కనిపించింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో భారీగా మొక్కలు నాటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది... మండల స్థాయిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వృక్షార్చనలో పాల్గొన్నారు. పట్టణాల్లో మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గ్రేటర్ వరంగల్‌లో మేయర్, నగర కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో మొక్కలు నాటారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మొక్కలు నాటి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. మంత్రి ఎర్రబెల్లి హనుమాన్‌నగర్ తండా, రాయపర్తి, మామునూరులో, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటా రు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, టీ రాజయ్య, అ రూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంక ర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఓడీసీ ఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, కుడా చైర్మన్ మర్రి యా దవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు ఎం.సుధీర్‌కుమార్, పీ సంపత్‌రెడ్డి, శ్రీహర్షిణి, ఏ బిందు, కే జగదీశ్ తదితరులు ఆయాచోట్ల స్థానిక నేతలు, అధికారులు, నాయకులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..