సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 16, 2021 , 01:49:04

వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా అవసరం

వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా అవసరం

  • భారీ పరిశ్రమ ఏర్పాటైతే ప్రజలకు మేలు
  • సీఎం వద్ద సిటీ మాస్టర్‌ ప్లాన్‌
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
  • నగర అభివృద్ధిపై కేసీఆర్‌కు ప్రత్యేక విజన్‌
  • ఎక్సెల్‌ ఇండియా-2021 లీడర్‌షిప్‌ మీట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ, ఫిబ్రవరి 15 : జిల్లాలోని రాజకీయ నాయకులు, మేధావు లు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా రూపొందించాలని రాష్ట్ర ప్రణాళిణా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. సోమవారం ఎక్సెల్‌ ఇండియా ఎడిటర్‌ ఎస్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో హన్మకొండలోని హారిత హోటల్‌లో జరిగిన వరంగల్‌ అభివృద్ధి ఎజెండా-2021 లీడర్‌షిప్‌ మీట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భారీ పరిశ్ర మ ఏర్పాటైతే ప్రజలకు మేలన్నారు. హన్మకొండ పార్లమెంట్‌ నియోజకవ ర్గం ఏర్పాటైన తర్వాత మొదటి ఎంపీ పీవీ నర్సింహారావు కాగా చివరి ఎంపీ గా తాను ఉన్నానన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరించే దిశగా సాగుతున్నదన్నారు. కాజీపేటలో రూ. 350కోట్లతో రైల్వే వ్యాగ న్‌ పీవోహెచ్‌ యూనిట్‌ ప్రారంభం కాబోతున్నదన్నారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తిచేసి రైల్వే శాఖకు అప్పగించామన్నారు. రైల్వే ప్రాజెక్టుల పరంగా వరంగల్‌కు 40 సంవత్సరాల నుంచీ అన్యాయమే జరుగుతోందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను చెన్నై, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లకు తరలించారన్నారు.  ఏపీలోని తిరుపతి, గుత్తిలో కూడా భారీ రైల్వే ప్రాజెక్టులున్నాయన్నారు. తెలంగాణలో వరంగల్‌ ఎడ్యుసెంటర్‌ అన్నారు. మలి దశ తెలంగాణ ఉ ద్యమం దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్‌, బియ్యాల జనార్దన్‌ ఆధ్వర్యంలో కేయూ నుంచి ప్రారంభమైందన్నా రు. కేయూలో డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ ఎకనామిక్స్‌ చైర్‌ను, తె లంగాణ డెవలప్‌మెంట్‌ స్టడీ స్‌ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి శాస్త్రవేత్త జలపతిరావు చాలా సూచనలు చేశారని, సీ ఎం కేసీఆర్‌ సైతం తెలంగాణలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. వరంగల్‌ గ్రోథ్‌ ఎజెండాలో భాగంగా కాకతీయ కెనాల్‌ను అభివృ ద్ధి చేయాలన్నారు. దేవాదుల నుంచి మరో పైపులైన్‌ వేయాలన్నారు. నగరంలో అన్ని వసతులతో కూడిన దవాఖాన, ఆర్‌ఈసీ పక్కనున్న స్థలంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ సీఎం వద్ద ఉందని, త్వరలోనే డిక్లేర్‌ చేస్తామన్నారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. కరుణాపురం వద్ద రోడ్డు డిజైన్‌ మార్చాలని ఎన్‌హెచ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.  

వరంగల్‌పై సీఎంకు ప్రత్యేక విజన్‌.. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక విజన్‌ ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాకతీయుల పాలన టెంపుల్స్‌, టౌన్స్‌, ట్యాంకులు అనే మూడు అంశాలపై సాగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించామన్నారు. వరంగల్‌కు రోడ్డు, రైల్వే కనెక్టివిటీ ఉందని, నగరానికి పూర్వవైభం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌కు త్వరలోనే ఏయిర్‌ కనెక్టివిటీ రాబోతుందన్నారు. నగరాన్ని టూరిజం హబ్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే నగరంలోని అగ్గలయ్యగుట్ట, భద్రకాళి బండ్‌ను అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వీసీ చిరంజీవులు, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, పీవీ నర్సింహారావు మనవరాలు సురభిఅజిత, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జలపతిరావు, డాక్టర్‌ శేషుమాధవ్‌, సయ్యద్‌ అజీజ్‌, నారాయణరెడ్డి, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, రాష్ట్రరైతు విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, కేఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డి, కేయూ డీన్‌ వరలక్ష్మి, ఫాదర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు. 

వేగంగా నగరాభివృద్ధి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా వరంగల్‌ మహానగరం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతాన్ని ఆవిష్కరించే దిశలో గ్రామాలను అభివృద్ది చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం వరంగల్‌ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వరంగల్‌ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక ఎజెండా రూపొందిస్తే వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.  


VIDEOS

logo