సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 14, 2021 , 01:43:56

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో వేగం పెంచాలి
  • ఏనుమాముల మార్కెట్‌ చైర్మన్‌ సదానందం 

గీసుగొండ, ఫిబ్రవరి 13 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏనుమాముల మార్కెట్‌ చైర్మన్‌ చింతం సదానందం అన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలోని రెండో డివిజన్‌ గొర్రెకుంట, మొగిలిచర్ల గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్‌ పరిధిలోని గ్రామా ల్లో పార్టీ సభ్యత నమోదులో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ దొంగల రమేశ్‌, వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు వేణు, నాయకులు గజ్జి రాజు, బాబు, ముక్కెర సతీశ్‌, శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌, పూర్ణచందర్‌, ఉజ్వల్‌, వెంకటేశ్వర్లు, శరత్‌, శ్రావణ్‌, కుమారస్వామి, సుమన్‌ పాల్గొన్నారు.  

3వ డివిజన్‌లో..

మున్సిపల్‌ పరిధిలోని 3వ డివిజన్‌ ధర్మారం గ్రామంలో శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను జిల్లా నాయకుడు సుంకరి శివ ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోలి రాజయ్య, విజయ్‌బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పేద ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉన్నదని పార్టీ మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం గ్రామాల్లో శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి కార్యకర్తను పార్టీ కంటికి రెప్పలా కాపాడుతుందని, ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. అనంతరం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పూండ్రు జైపాల్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ కుమారస్వామి, సర్పంచులు వీరాటి కవిత, అంకతీ నాగేశ్వర్‌రావు, బోడకుంట్ల ప్రకాశ్‌, గోను మల్లయ్య, జక్కు మురళి, చిన్ని, రవీందర్‌రెడ్డి, వీరస్వామి, రమేశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌  గుర్రం రఘు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo