గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 14, 2021 , 01:43:59

విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగు

విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగు

 • రూ.100 కోట్లతో ఆరో డివిజన్‌లోని గ్రామాల అభివృద్ధి 
 • గతంలో రూ.70 కోట్లు.. తాజాగా రూ.35 కోట్లతో పనులు
 • సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం
 • మారుతున్న గ్రామాల రూపురేఖలు
 • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

గ్రేటర్‌ విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఆరో డివిజన్‌ పరిధిలోనిగ్రామాలకు నిధుల వరద కొనసాగుతోంది. ఇక్కడ సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి జరుగుతోంది. నూతన ఏడాదిలో పనులు జోరందుకున్నాయి. కొంత కాలంగా కరోనా నేపథ్యంలో ఆగిన పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. 

- కరీమాబాద్‌, ఫిబ్రవరి13 

గ్రేటర్‌ 6వ డివిజన్‌లోని పలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసింది. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్‌ చింతల యాదగిరి ఆధ్వర్యంలో డివిజన్‌లోని ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. పలు చోట్ల కమ్యూనిటీ భవన నిర్మాణాలు చేపడుతూ ప్రజల సమస్యలను తీరుస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.

సుమారు రూ.100 కోట్లతో పనులు..

గతంలో డివిజన్‌ అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు వెచ్చించారు. తాజాగా మరో రూ.35 కోట్లతో ఇటీవల ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో డివిజన్‌లోని గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. 

ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా 

నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా. విలీన గ్రామాల్లో రూ.కోట్లతో పనులను చేపడుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తా. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. మరిన్ని పనుల కోసం ప్రణాళికలు రూపొందించాం. ఎల్లకాలం గుర్తుండి పోయేలా అభివృద్ధి చేస్తా. 

- అరూరి రమేశ్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే

ఎమ్మెల్యే, మేయర్‌ సహకారంతో.. 

ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సహకారంతో దాదాపు రూ.100 కోట్లతో డివిజన్‌లో అభివృద్ధి పనులను చేపట్టాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తా. ఏళ్ల తరబడి డివిజన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించా. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్‌ విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నది.  

- చింతల యాదగిరి, కార్పొరేటర్‌

ఇటీవల చేసిన శంకుస్థాపనలు 

 • రూ.60 లక్షలతో జక్కలొద్ది నుంచి షాబాస దర్గా వరకు రోడ్డు నిర్మాణం
 • రూ.50 లక్షలతో జక్కలొద్దిలో సీసీ, డ్రైనేజీ నిర్మాణం 
 • రూ.50 లక్షలతో లక్ష్మీపూర్‌లో సీసీ, డ్రైనేజీ నిర్మాణం 
 • రూ.33 లక్షలతో తిమ్మాపూర్‌ నుంచి అమ్మవారిపేట వరకు కాల్వ పనులు
 • రూ.36 లక్షలతో తిమ్మాపూర్‌లో గౌడ కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో తిమ్మాపూర్‌లో ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌  
 • రూ.36 లక్షలతోఅల్లీపూర్‌లో ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో అల్లీపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో తిమ్మాపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో కుమ్మరిపల్లిలో యాదవ కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో అల్లీపూర్‌లో మున్నూరుకాపు కమ్యూనిటీ హాల్‌ 
 • రూ.36 లక్షలతో సింగారంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌   

VIDEOS

logo