‘కోటి వృక్షార్చన’ను జయప్రదం చేయాలి

- అధికారులు సమన్వయం చేయాలి
- హరితహారంతో అడవులకు పూర్వ వైభవం
- కార్యదర్శులు అంకితభావంతో పని చేయాలి
- జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటాల్సి ఉంటుందన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు. ఈజీఎస్, పంచాయతీ అధికారులు సమన్వయం చేయాలన్నారు. హరితహారంతో రాష్ట్రం పచ్చగా మారుతున్నదని, అడవులకు పూర్వ వైభవం వస్తున్నదని గుర్తుచేశారు.
ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని జడ్పీ చైర్పర్సన్ పిలుపునిచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలను పట్టణాలకు దీటుగా మారుస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలతో పల్లెల ముఖచిత్రం మారిపోయిందని వివరించారు. ప్రభుత్వం పల్లెలకు నిధులను విరివిగా అందజేస్తున్నదని, వాటిని గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవాలని ఆమె సూచించారు. పంచాయతీ జూనియర్ కార్యదర్శులు అంకితభావంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్‌బాబు, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, ఎంపీవో రంజిత్‌కుమార్, ఏపీవో అనిత పాల్గొన్నారు. అనంతరం ఆరె తెలంగాణ క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం నాయకులు కే దామోదర్‌రావు, వరికెల కిషన్‌రావు, ఇటుకాల పాపారావు, వీ కిషన్‌రావు పాల్గొన్నారు. తర్వాత ఆమె పలువురిని పరామర్శించారు. గండ్ర జ్యోతి వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌లు కందగట్ల రవి, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్, మారెపల్లి నందం, గడ్డం బాబు ఉన్నారు.
గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలి
సంగెం: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఈ నెల 17న ఒక్కో గ్రామంలో వెయ్యి మొక్కల చొప్పున నాటాలని ఎంపీపీ కందకట్ల కళావతి పిలుపునిచ్చారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికల వద్ద మొక్కలు నాటాలని ఎంపీపీ కోరారు. ఈ నెల 16న మొక్కలు నాటేందుకు గుంతలు తీసి 17న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సైరన్ ఇచ్చి మొక్కలు నాటాలన్నారు. సదస్సులో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, వైస్ ఎంపీపీ మల్లయ్య, ఎంపీవో కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
నల్లబెల్లి: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ ఊడుగుల సునీత కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని 29 జీపీల్లో మొక్కలు నాటాలని, ఒక్కో జీపీ పరిధిలో వెయ్యి మొక్కలు నాటేందుకు అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో కూచన ప్రకాశ్, ఏపీవో వెంకటనారాయణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- సురభి గెలుపే ధ్యేయంగా..
- పట్టభద్రులు ఆలోచించండి..!
- పట్టభద్రులే సరైన నిర్ణేతలు
- లక్షా33 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే: మంత్రి తలసాని
- కీసర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
- జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
- ఇక స్వామి దర్శనమే!
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్
- ఓటీటీల్లో అశ్లీలం!
- ముమ్మరంగా ప్రచారం