నయా ఈ బైక్

కరీమాబాద్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బైక్ తప్పనిసరి. విపరీతంగా పెరిగిపోయిన వీటి వాడకంతో వెలువడుతున్న కార్బన్డయాక్సైడ్ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నది. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు బైక్ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లపై దృష్టి సారించాయి. ఇప్పటికే వరంగల్ నగరంలో పలు ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్‌లు వెలియగా తాజాగా ఈఈవీఈ ఇండియా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్‌లో ఈ కంపెనీకి చెందిన షోరూంను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఆరు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. బైక్‌లోని సిమ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ప్రత్యేక యాప్ ద్వారా బైక్‌ను ఆపరేట్ చేసే సదుపాయం ఉండడంతో అది చోరీకి గురికావడం అసాధ్యమని నిపుణులు చెబతున్నారు. సేఫ్ అండ్ సెక్యూర్ విధానం, జీరో పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్.. రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడంతో పలువురు ఈ బైక్‌లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
యూనిట్ కరంట్‌తో 60 నుంచి 70 కిటోమీటర్లు
యూనిట్ కరంట్‌తో బైక్‌లోని బ్యాటరీలు ఫుల్‌చార్జ్ అవుతాయి. బ్యాటరీ పూర్తిగా నిండేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కొన్ని బ్యాటరీలకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఇలా ఫుల్ చేసిన బ్యాటరీలతో దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అంటే సుమారు రూ.10 ఖర్చుతో 50కి పైగా కిలోమీటర్లు వెళ్లవచ్చు. బైకులోని బ్యా టరీకి ఎక్కడైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
సిమ్ సిస్టమ్‌తో లైవ్ లొకేషన్..
సెల్ఫోన్లానే బైక్‌లో కూడా సిమ్ సిస్టమ్‌ను కంపెనీ అమర్చింది. దీని ద్వారా నిరంతరం బైక్ లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ విధానం(ఐవోటీ)తో బైక్‌ను ప్రతి క్షణం పరిశీలించవచ్చు. కాకపోతే బైక్‌లో ఏర్పాటుచేసిన సిమ్‌కు ఏటా రూ.550 రీచార్జ్ చేసుకోవాలి.
రాష్ట్రంలోనే తొలి షోరూమ్
ఈఈవీఈ ఇండియా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్‌లో ఏర్పా టు చేశాం. సిమ్ సిస్టమ్‌తో లైవ్ లొకేషన్ యాప్ ద్వారా బైక్ ఆపరేటింగ్ దీని ప్రత్యేకత. వినియోగదారులు మెచ్చేలా నాణ్యతా ప్రమాణాలతో బైకులు ఉన్నాయి. ప్రభుత్వాలు సైతం విద్యుత్ వాహనాలకు పలు రాయితీలు ఇస్తున్నాయి. మోటరుపై ఐదేళ్లు, బ్యాటరీపై మూడేళ్ల వారంటీ ఉంటుంది. -రవీందర్‌రెడ్డి, గ్రీన్ ప్లానెట్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ యజమాని
అందుబాటులో ఆరు మోడళ్లు
ప్రస్తుతం ఆరు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు మోడళ్లు లెడ్ యాసిడ్ (షీల్డ్ జెల్ బ్యాటరీ) బైక్‌ల ధర రూ.53వేల నుంచి రూ.70 వేల వరకు ఉండగా మరో రెండు మోడల్స్ (లిథియం అయాన్) బ్యాటరీల బైకులు రూ.74వేల నుంచి రూ.78వేల వరకు అందుబాటులో ఉన్నాయి. బైకులో ఉండే బ్యాటరీల ధర వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.12వేల నుంచి రూ.30వేల వరకు ఉంటుంది. కంపెనీ బైకులకు ఐదేళ్ల వారంటీ ఉంది.
యాప్ ద్వారా ఆపరేటింగ్
ఎలక్ట్రిక్ బైక్‌ను డ్రైవింగ్‌తో పాటే కాకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఏఈఆర్ ట్రాక్ సిస్టమ్‌తో అది కిలోమీటర్లు కావాలంటే అన్ని కిలోమీటర్ల వరకు వెళ్లేలా లాక్ చేయొచ్చు. లాక్ చేస్తే దానిని ఇంచు కూడా జరపడం సాధ్యం కాదు. బైక్‌ను మనకు తెలియకుండా ఎవరైనా తీసుకుపోయినా యాప్ ద్వారా ఆఫ్ చేసే వెసులుబాటు ఉంది.
తాజావార్తలు
- సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్దే ప్రథమ స్థానం
- ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. స్నేహితురాలి తండ్రి పనేనా.!
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్