ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Feb 09, 2021 , 01:12:57

మన పల్లాకు మళ్లీ చాన్స్‌

మన పల్లాకు మళ్లీ చాన్స్‌

  • ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
  • వరంగల్‌ జిల్లా నేతకు మరోసారి అవకాశం
  • 12 నుంచి హోరెత్తనున్న ప్రచారం 
  •  గ్రామ స్థాయి నుంచి పార్టీకి కొత్త రూపు
  •  సభ్యత్వ నమోదు కోసం ఇన్‌చార్జిల నియామకం
  • వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాజేశ్వర్‌రెడ్డి

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మళ్లీ అవకాశం దక్కింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్‌లో పోటీకి వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన పల్లానే పార్టీ అధిష్టానం రెండోసారి ఖరారు చేసింది. 2015లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన, అప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేయడం, ఉన్నతవిద్యావంతుడు కావడం, మూడు ఉమ్మడి జిల్లాలకు సుపరిచితుడు కావడంతో పల్లానే సరైన అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఈనెల 12నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలు సన్నాహాలు చేస్తున్నారు. 

మన పల్లాకు మళ్లీ చాన్స్‌

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాజేశ్వర్‌రెడ్డి

ఖరారు చేసిన పార్టీ అధిష్టానం

వరంగల్‌, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ అవకాశం దక్కింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఈ నియోజకవర్గంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన పల్లా రెండోసారి బరిలో దిగనున్నారు. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన పల్లా, అప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నారు. అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల సమస్యలు, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన పల్లా విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు సుపరిచితుడుగా ఉన్న పల్లా సరైన అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా అధికారికంగా ఖరారు కావడంతో ప్రచారంలో జోరు పెంచేలా టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 12న పాలకుర్తి, తొర్రూరులో భారీ ప్రచార సభలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్ణయించారు. ఉమ్మ డి వరంగల్‌ జిల్లాలో ప్రచార జోరును పెంచేలా ఈ రెండు సభల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పల్లా గెలుపు లక్ష్యంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతలను ఇన్‌చార్జిలుగా నియమించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రచార సభల నిర్వహణ కూడా పూర్తికావొస్తున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించేలా తదుపరి ప్రచార వ్యూహం సిద్ధమవుతున్నది. పల్లా ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. ఆలోపే ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. మరో పదిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడులయ్యే అవకాశం ఉంది. 

బలమైన గులాబీ దళం..

టీఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చడమే లక్ష్యంగా మరోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరో 15 రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు. సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకోనున్నారు. మార్చి చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కోసం పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులను ఇన్‌చార్జిలుగా నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మూడు జిల్లాల బాధ్యతల అప్పగించారు. వీరి పర్యవేక్షణలో ఒక్కో జిల్లాకు ఒకరు చొప్పు న రాష్ట్ర కార్యదర్శులను నియమించారు.

జిల్లా                         ఇన్‌చార్జి కార్యదర్శి           ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి 

వరంగల్‌ అర్బన్‌        ఎడవల్లి కృష్ణారెడ్డి                    గ్యాదరి బాలమల్లు

వరంగల్‌ రూరల్‌          మెట్టు శ్రీనివాస్‌                    గ్యాదరి బాలమల్లు

జనగామ                    మాలోతు కవిత            గ్యాదరి బాలమల్లు

మహబూబాబాద్‌       లింగంపల్లి కిషన్‌రావు          నారదాసు లక్ష్మణ్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి               నారదాసు లక్ష్మణ్‌రావు

ములుగు                   పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి         నారదాసు లక్ష్మణ్‌రావు

VIDEOS

logo