శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 04, 2021 , 00:53:00

వీడిన కారు డ్రైవర్‌ హత్య మిస్టరీ

వీడిన కారు డ్రైవర్‌ హత్య మిస్టరీ

  • పెప్పర్‌ స్ప్రే చల్లి రాయితో కొట్టి హత్య
  • నిందితుడి అరెస్ట్‌ వివరాలు వెల్లడించిన సీపీ ప్రమోద్‌కుమార్‌

హన్మకొండ సిటీ, ఫిబ్రవరి 3 : పాలకుర్తి మండలం రాఘవాపురం బస్టాప్‌ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ ప్రమోద్‌కుమా ర్‌ తెలిపారు. బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సీపీ వివరాలను వెల్లడించారు. పాలకుర్తి మండల కేంద్రంలో కేబు ల్‌ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న పరాంకుశం యుగేంధర్‌స్వామి కుమారుడు రోషన్‌ తం డ్రి ఆదాయంతో జల్సాలు చేసేవాడు. జ ల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో చో రీలు చేయడం ప్రారంభించాడు. 2018 నుంచి ఇప్పటి వరకు 4 ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. కార్లను దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, జల్సాలకు సరిపోతా యని భావించాడు. పథకంలో భాగంగా నిందితుడు రెండు పెప్పర్‌ స్ప్రేలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. ఈ నెల 23న హన్మకొండ వచ్చి ఒంటరిగా వచ్చే కా రు డ్రైవర్లపై నిఘా పె ట్టాడు. ఈసమయంలో హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటున్న హన్మకొండ కుమార్‌పల్లికి చెంది న మడత నర్సింహ  నిట్‌ కళాశాల ప్రాం తంలో కారుతో ప్రయాణికుల కోసం ఎదు రు చూస్తున్నాడు. నిందితుడు కారును కి రాయి మాట్లాడుకుని తొలుత జనగామకు, అటునుంచి  పాలకుర్తికి తీసుకెళ్లాడు. తిరిగి హన్మకొండకు వస్తుండగా మూత్ర విసర్జన సాకుతో రాఘవపురం బస్టాప్‌లో కారు ది గి డ్రైవింగ్‌ సీటులో ఉన్న నర్సింహపై పెప్ప ర్‌ స్ప్రే చల్లాడు. డ్రైవర్‌ ప్రతిఘటిస్తూ కాల్వ లో పడిపోగా రాయితో కొట్టి హత్య చేశా డు. అనంతరం కారుతో సీసీ కెమెరాలకు చిక్కకుండా ఇంటికి వెళ్లాడు. వెస్ట్‌జోన్‌ డీసీ పీ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి ది గిన పాలకుర్తి సీఐ చేరాలు ఆధునిక టెక్నాలజీతో నిందితుడిని గుర్తించారు. బుధవా రం పక్కా  సమాచారంతో పాలకుర్తి శివారులో మాటు వేసి నిందితుడిని అదుపులో కి తీసుకున్నారు. కారు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కోర్‌, సైబర్‌ క్రైం విభాగం సీఐలు రా ఘవేందర్‌, జనార్దన్‌రెడ్డి, దేవరుప్పల, కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు కరుణాకర్‌, సతీశ్‌, పవన్‌కుమార్‌ను సీపీ అభినందించారు. 


VIDEOS

logo