ఓపికను పరీక్షించొద్దు

- మా జోలికొస్తే తడాఖా చూపిస్తాం
- ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేస్తే ఊరుకునేదిలేదు
- మేం తల్చుకుంటే బీజేపీ నామరూపాలు లేకుండాపోతుంది..
- సీఎం కేసీఆర్ మీకంటే పెద్ద హిందువు
- అన్ని మతాలకు సమాన గౌరవం
- చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ చౌరస్తా, ఫిబ్రవరి 1 : ‘మా ఓపికను పరీక్షించొద్దు.. మా జోలికొస్తే తడాఖా చూపిస్తాం.. ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేస్తే ఊరుకునేది లేదు’ అని బీజేపీ నాయకులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా 41వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ‘ప్రజాసంక్షేమం-ప్రగతి యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. మేం తల్చుకుంటే బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందన్నారు. సీఎం కేసీఆర్ మీ కంటే పెద్ద హిందు వు.. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని చెప్పారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని, ఏమైనా ఉంటే ప్రజల మధ్య తేల్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెబుతారన్నారు. 41వ డివిజన్లో రూ.కోటితో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు వినయ్‌భాస్కర్ చెప్పారు. డివిజన్లో ఇప్పటివరకు 270 మందిని ఆర్థికంగా ఆదుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రజాసంక్షేమం-ప్రగతి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 41వ డివిజన్ ప్రజలు చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌కు బ్రహ్మరథం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూజుగుండ్ల రాజేంద్రకుమార్, డివిజన్ అధ్యక్షులు పానుగంటి శ్రీధర్, ప్రదీప్, కూచన సునీల్, అనురాం, పమ్మీ రమేశ్, తులా చందర్, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!