మొదటి విడుతలోనే సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి

- త్వరలోనే డీపీఆర్ సిద్ధం
- భూ సేకరణ సమస్య లేదు
- ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
వరంగల్ సబర్బన్, జనవరి 31 : మొదటి విడుతలోనే సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) సిద్ధం అవుతున్నదని తెలిపారు. ఈ జాతీయ రహదారికి త్వరలోనే నంబర్ కేటాయిస్తారన్నారు. మండల పరిధిలోని సూరారంలో ఇటీవల హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగెడ మహేందర్ తల్లి అనారోగ్యంతో చనిపోగా ఆయన కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్కతుర్తి-సిద్దిపేట రహదారి గురించి ఈఎన్సీ గణపతి రెడ్డితో పాటు ఢిల్లీలోని కేంద్ర కార్యదర్శి గిరిధర్‌తో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపాదిత ఎల్కతుర్తి-సిద్దిపేట- రామాయంపేట-మెదక్ రహదారిలో రామాయంపేట-మెదక్ మార్గంలో భూసేకరణ సమస్య ఉందని, ఎల్కతుర్తి-సిద్దిపేట మధ్యలో ఏ సమస్యా లేదన్నారు. గతంలోనే ఈ రోడ్డును విశాలంగా నిర్మించేందుకు సరిపోను భూమిని సేకరించారన్నారు. మధ్యలో ఎక్కడా నివాస గృహాలు లేవని, వాటిని కూల్చాల్సిన అవసరం ఉండదన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మాత్రం బైపాస్ వేస్తామని వెల్లడించారు. త్వరలోనే మంజూరు వస్తుందన్నారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారి పనులు కూడా మొదలవుతాయని చెప్పారు. రోడ్డు పనుల్లో ఇండ్లు కోల్పోయే వారికి మంచి ధరలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌హెచ్-563 ప్రాజెక్టు డైరెక్టర్‌ను పంపిస్తానని ఆయనకు సమస్యలు వివరించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కరీంనగర్ డీసీసీబీ డైరెక్టర్ శ్రీపతి రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు కొమ్మిడి నిరంజన్ రెడ్డి, కడారి రాజు, ఎల్తూరి స్వామి, మునిగడప శేషగిరి, వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశ మార్గాన్ని రీడిజైన్ చేయాలి..
హన్మకొండ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ వరంగల్ మహానగర గౌరవాన్ని మరింత ఇమడింపజేసేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి చేరే ప్రవేశ మార్గాన్ని రీడిజైన్ చేసి అక్కడ కొత్తగా ైప్లె ఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి నగరంలోకి ప్రవేశించే రోడ్డులో అండర్‌పాస్ వల్ల వాహనాల డ్రైవర్లు గందరగోళానికి గురవుతున్నారని, దారి తప్పి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. నగరం స్మార్ట్‌సిటీ పథకానికి ఎంపికైందని, 406 కిలోమీటర్ల వైశాల్యం కలిగి 10 లక్షల జనాభా కలిగిన వరంగల్‌కు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జాతీయ రహదారి 163పై కరుణాపురం వద్ద నిర్మించిన ఓవర్ పాస్ వైశాల్యం ఇరువైపులా 7.5 మీటర్లు ఉందని, కానీ క్యారియేజ్ పాస్ మాత్రం 6 మీటర్లే ఉందన్నారు. క్యారియేజ్ పాస్ కనీసం 7 మీటర్లు ఉండాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో వరంగల్ నగర సమీపంలో ప్రమాదకర మలుపులు ఉన్నాయని, వీటిని సరిచేయాలన్నారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినోద్‌కుమార్ కేంద్రమంత్రికి రాసిన లేఖలో కోరారు.
తాజావార్తలు
- కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- విపక్షాల..అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి
- గుట్టను మలిచి.. తోటగా మార్చి..
- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
- ఎమ్మెల్సీ ఎన్నికకు దిశానిర్దేశం
- టీఆర్ఎస్కే ఓట్లడిగే హక్కుంది
- సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట
- సకల హంగులతఓ నందిగామ