గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 01, 2021 , 00:13:57

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

  • మనసున్న కేసీఆర్‌ ప్రభుత్వం 
  • ఈడబ్ల్యూఎస్‌ జీవో ఇప్పించే బాధ్యత తీసుకుంటా
  • పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ హర్షించదగిన విషయం
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ, జనవరి 31: సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మనుసున్న ప్రభుత్వమని, ఆయన అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్‌ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు గోపు జయపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఓసీ రాష్ట్ర మహాగర్జనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్‌ జీవో ఇప్పించే బాధ్యత తనదేనని, మాట తప్పే వ్యక్తిని కాదని, సీఎం కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లి చర్చించి జీవో జారీ చేయించేందుకు కృషి చేస్తానని  అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పేర్కొన్నారు. అగ్ర కులాల పేదలకు కూడా 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం నిజంగా హర్షించ దగిన విషయం అన్నారు. అంతకుముందు ఓసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ అన్ని శాఖల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని, వెంటనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో వెంటనే అమలు చేయకపోవడంతో ప్రభుత్వం భర్తీ చేయనున్న 50వేల ఉద్యోగాల్లో ఓసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాటి రామారావు, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, వైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్‌, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సేవా సమాఖ్య అధ్యక్షుడు జగన్‌మోహన్‌శర్మ, రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, సత్యమోహన్‌, రావుల నర్సింహారెడ్డి, లెక్కల జలేంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

పొదుపులో మహిళలు ఆదర్శం - మంత్రి దయాకర్‌రావు

రూ. 32 కోట్లతో పాడి గేదెలు, పెరటి కోళ్లు, ఈ-ఆటోల పంపిణీ

తొర్రూరు, జనవరి 31: పొదుపులో మహిళలు ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులో రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానో త్సవంతోపాటు కంఠమహేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం స్వయంసహాయక సంఘాల మహిళలకు రూ.32 కోట్ల స్త్రీనిధి నిధులతో పాడి పశువులు, ఎలక్ట్రిక్‌ ఆటోలు, పెరటి కోళ్లను పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి అభినందించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్త్రీనిధి సంస్థలాంటివి దేశంలో ఎక్కడా లేవని, దీన్ని మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. జై శ్రీరాం మత సభ్యులు రామమందిర నిర్మాణం నిధుల సేకరణ కోసం మంత్రిని కోరగా తమ పార్టీ నుంచి నిధులను అందిస్తామని, తన వంతు సాయంగా రూ.10 వేలను అం దించారు. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, డీఆర్‌డీవో పీడీ విద్యాచందన, డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, ఎంపీపీలు, జడ్పీ టీసీలు తుర్పాటి చిన్న అంజయ్య, రాజేశ్వరి, శ్రీనివాస్‌, జ్యోతిర్మయి, మున్సిపల్‌ కమిషనర్‌ బాబు, మండల పార్టీ అధ్యక్షులు సీతారాములు, అయిలయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo