శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Jan 31, 2021 , 00:08:27

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, జనవరి 30 : ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నందున అరూరి గట్టుమల్లు ఫౌండేషన్‌ ద్వారా మరోసారి నిరుద్యోగ యువత కోసం శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. వర్ధన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు శనివారం నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేశ్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు గతంలో మాదిరి ఉచితంగా వసతి, భోజనాన్ని అందిస్తూ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన శిక్షణ ద్వారా నియోజకవర్గంలో సుమారు 600 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మోహన్‌రావు, కౌన్సిలర్లు రాజమణి, రామకృష్ణ, రవీందర్‌, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

చంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం 

ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి  ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌, ఉడుతగూడెం మాజీ సర్పంచ్‌ జెన్నపురెడ్డి చంద్రారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండలంలోని ఉడుతగూడెంలో చంద్రారెడ్డి సంవత్సరికం సందర్భంగా ఏర్పాటు చేసి విగ్రహానికి డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొలెపల్లి శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిద్దెపాక రవీందర్‌, పొలెపల్లి రాజిరెడ్డి, సర్పంచ్‌ ఆరోగ్యం, ఎంపీటీసీ దామేర అనూష అనిల్‌, సొసైటీ డైరెక్టర్‌ వడిచెర్ల శ్రీనివాస్‌   

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

హసన్‌పర్తి : మండల కేంద్రంలోని శుభమస్తు గార్డెన్‌లో వివిధ గ్రామాలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు రూ.1.25కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా అండగా ఉండాలనే  సీఎం కేసీఆర్‌ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్‌ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత,  రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ అంచూరి విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ రాజు నాయక్‌, సరోత్తంరెడ్డి, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్‌, డివిజన్‌ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్‌, శివరాం ప్రసాద్‌, భూపాల్‌ గౌడ్‌, చకిలం రాజేశ్వర్‌రావు, చంద్రమోహన్‌, మణీంద్రనాథ్‌, దికొండ భిక్షపతి, జీవన్‌రెడ్డి, బొల్లవేణి రాజు, ప్రసాద్‌, సాంబరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కుడా డైరెక్టర్లు, రమేశ్‌ యాదవ్‌, చిర్ర రాజు పాల్గొన్నారు. 

పర్వతగిరి మండలంలో..

పర్వతగిరి  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 64 మంది లబ్ధిదారులకు రూ. 64.07లక్షల విలువైన  షాదీముబారక్‌  చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ లునావత్‌ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్‌, తహసీల్దార్‌ మహమూద్‌ అలీ, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు మనోజ్‌కుమార్‌, గొర్రె దేవేందర్‌, వైస్‌ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌,  మార్కెట్‌ డైరెక్టర్లు శాంతి రతన్‌రావు, ఏకాంతం గౌడ్‌, సర్పంచ్‌లు మాలతి, అమడగాని రాజు, వెంకన్న, ఉమ, ఎంపీటీసీలు మాడుగుల రాజు, లావణ్య, మోహన్‌రావు, భాస్కర్‌, ఆర్‌ఐ సత్యనారాయణ  పాల్గొన్నారు. 

VIDEOS

logo