శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 31, 2021 , 00:08:27

హరిత రక్షకభట నిలయం

హరిత రక్షకభట నిలయం

  • పచ్చని చెట్ల మధ్య వేలేరు పోలీస్‌ స్టేషన్‌ 
  • ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటున్న ఠాణా

వేలేరు, జనవరి 30 : పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణంతో వేలేరు పోలీస్‌స్టేషన్‌ ఆకట్టుకుంటోంది. స్టేషన్‌ ఆవరణలో నాటిన రకరకాల మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. విశాలమైన స్థలంలో పచ్చదనంతో స్టేషన్‌ సుందరవనంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే మండలంలోని పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు మొక్కలను పెంచారు. కాగా, వేలేరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో స్టేషన్‌ ఆవరణ మొత్తం పచ్చని వనంలా కనిపిస్తోంది. ఇక్కడ  100 మొక్కలు నాటారు. వీటిలో రకరకాల షోకేజ్‌ మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కల్లో జామ, సపోట, దానిమ్మ, నేరేడు, మామిడి ఉండగా, వివిధ రకాల పూల మొక్కలు స్టేషన్‌కు వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

బాధ్యతగా పెంచుతున్నాం.. 

పర్యావరణ పరిరక్షణ కోసం మా వంతు బాధ్యతగా మొక్కలను పెంచుతున్నాం. రోజూ శాంతి భద్రతలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటూనే మొక్కల రక్షణ చేపడుతున్నాం. మా సిబ్బంది డ్యూటీలా కాకుండా ఒక బాధ్యతగా మొక్కలను కాపాడుతున్నారు. వాటికి ప్రతి రోజూ నీరు పోస్తున్నారు. 

- తుమ్మ శ్రావణి,

ఎస్సై నిరంతరం శ్రమిస్తున్నాం 

మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణకు మేము నిరంతరం శ్రమిస్తున్నాం. మొక్కల చుట్టూ చదును చేసి, రోజూ నీరందిస్తున్నాం. మేము పడిన శ్రమ ఫలితంగానే నేడు స్టేషన్‌ ఆవరణలో మొక్కలు అడవిని తలపించే స్థాయిలో ఉన్నాయి. 

-వెంకటేశ్వర్లు, ఏఎస్సై  


VIDEOS

logo