పేదల సీఎం కేసీఆర్

- సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం
- విజన్ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్
- త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ
- హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి
- ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
- సమస్యల పరిష్కారానికి సానుకూలం
- మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు
- నగరంలో పంచాయతీ కార్యదర్శుల
- సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరు
- తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా డైరీ, రామవరంలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
పేదల సీఎం కేసీఆర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం హన్మకొండలో నిర్వహించిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి సదస్సుకు వారు హాజరయ్యారు. అంతకు ముందు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా డైరీని, ఉదయం జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల మండలాలకు చెందిన సుమారు 239 మందికి మినీ డెయిరీ యూనిట్ల కింద మంజూరైన రూ.9.52కోట్లు, 185 మందికి రూ.కోటీ 90 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బమ్మెర పోతన స్మృతి వనం పనులను పరిశీలించారు. ఖిలావరంగల్ కోటలోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.85లక్షలతో శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మధ్యకోటలోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.85లక్షల నిధులతో మంత్రులు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్‌యాదవ్, కుందారపు రాజేందర్, కేడల పద్మ, ఎం.రజిత, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, పురావస్తు శాఖ అధికారులు నారాయణ, నాగరాజు, మల్లునాయక్ పాల్గొన్నారు.
హన్మకొండ/ ఖిలావరంగల్/ కొడకండ్ల/ పాలకుర్తి రూరల్, జనవరి 29 : పేదల సీఎం కేసీఆర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు వారు హాజరయ్యారు. ముందుగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలకుర్తిలో మినీ డెయిరీ యూనిట్లు, కల్యాణ లక్ష్మి చెక్కులను కలెక్టర్ నిఖిల, జడ్పీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. భగీరథ వాటర్ బాటిళ్లను ఆవిష్కరించారు. బమ్మెర పోతన స్మృతి వన పనులను పరిశీలించారు. ఇక్కడ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బడుగుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గీత వృత్తికి చెందిన వ్యక్తికే ఎక్సైజ్ శాఖను అప్పగించారని, గీత వృత్తిని కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే నీరాను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడని, రాష్ర్టానికి ఆయన సేవలు అవసరమని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేటీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. గరీబోల్ల సీఎం కేసీఆర్ అని, ఆయన పాలనలో రాష్ట్రంలోని పేదల కష్టాలన్నీ తీరాయన్నారు. తెలంగాణలో పాల విప్లవం రావాలని ఆకాంక్షించారు. గోదావరి జలాలతో చెరువులు నింపిన ఘనత మంత్రి ఎర్రబెల్లికే దక్కిందని, నిరంతర అభివృద్ధి కాముకుడని కొనియాడారు. వాట్సాప్, ఫేస్బుక్ పార్టీల మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. పాలకుర్తి ఓ పుణ్యభూమి అని, వీరులగన్న నేల అని అన్నారు. బమ్మెరను బాసరగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పని చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దయ వల్ల రూ.45వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీళ్లు ఇస్తున్నామన్నారు. ఎస్సీల అభివృద్ధికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.80కోట్లు, జనగామ జిల్లాకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రామవరంలో గీత కార్మికులతో ముచ్చట్లు
కొడకండ్ల మండలం రామవరంలో పాపన్న విగ్రహావిష్కరణకు ముందు మంత్రులిద్దరూ మార్గమధ్యంలో కల్లు మండువ వద్దకు వెళ్లారు. గీత కార్మికులతో కాసేపు ముచ్చటించారు. తాటి కల్లు తాగి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక్కడ వారి వెంట బీసీ సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాస్ గౌడ్, బండి సాయన్న, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్, జడ్పీటీసీ సత్తెమ్మ, పాలకుర్తిలో ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్‌కుమార్, అదనపు కలెక్టర్ హమీద్, ఆర్డీవో మధుమోహన్, ఎంపీపీలు నల్లానాగిరెడ్డి, బస్వ సావిత్రి మల్లేశం, జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, పల్ల భార్గవీ సుందర్రామిరెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంకు చైర్మన్ అశోక్‌రెడ్డి, పసునూరి నవీన్, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్ పాల్గొన్నారు.
ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో టీజీవోస్ వరంగల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు అధ్యక్షతన జరిగిన ‘తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ 2021’ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. నాటి ఉద్యమం నుంచి నేటి వరకు అన్ని విధాలా వరంగల్ జిల్లా ఉద్యోగులు అండగా ఉన్నారని, ఉద్యోగులు, అధికారుల సంఘాలు పెట్టాలంటేనే భయపడే సందర్భాల్లో వెన్నంటి ఉన్నది కూడా ఇక్కడి ఉద్యోగులేనని చెప్పారు. గతంలో ఆశించిన దానికంటే అధికంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, నెలలోనే 70వేల మంది అధికారులు, ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. 42 రోజులు సమ్మె చేస్తే 43రోజుల వేతనం కల్పించారని గుర్తు చేశారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే పీఆర్సీ ప్రకటన చేశారని, ఫలితం ఉద్యోగులకు ఆమోదయోగ్యంగానే ఉంటుందన్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎంకు ఉద్యోగుల కష్టసుఖాలు తెలుసని, అంతా సంతోషపడే విధంగానే పీఆర్సీ ఉంటుందన్నారు.
పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గిస్తాం..
తెలంగాణ ఏర్పాటు తర్వాతే పల్లెల రూపురేఖలు మారాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి మొదటి సదస్సు, డైరీ ఆవిష్కరణలో మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విఫ్ వినయ్‌భాస్కర్‌తో కలిసి పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 9600 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టామని గుర్తుచేశారు. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గిస్తామని, రెండేళ్లు పూర్తయిన వారిని రెగ్యులరైజ్ చేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఫోరంగా ఏర్పడి మొదటి సదస్సును వరంగల్‌లో నిర్వహించుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ఉద్యోగ జేఏసీ నాయకుడు పరిటాల సుబ్బారావు, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ ఏ జగన్మోహన్రావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, టీజీవోస్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఉమ్మడి జిల్లా నాయకులు డీ మురళీధర్‌రెడ్డి, ఎండీ అమ్జద్అలీ, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఈగ వెంకటేశ్వర్లు, కిరణ్‌గౌడ్, రవి, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్‌కుమార్, ఎం.శ్రీను, కే రాజేశ్‌గౌడ్, ఆకుల రాజేందర్, కత్తి రమేశ్, రఘుపతి, పర్వతాలు, మహేశ్, విజయ్‌కుమార్, సోమన్న, శ్యాం, పుల్లూరి వేణుగోపాల్, రాజేశ్, రామూనాయక్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం