ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 30, 2021 , 00:21:05

త్వరలో నిరుద్యోగ భృతి

త్వరలో నిరుద్యోగ భృతి

  • ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు.. గులాబీ జెండా ప్రజలకు అండ
  • ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • రూ.500 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం
  • ప్రతి ఇంటికి 150 లీటర్ల మిషన్‌ భగీరథ నీళ్లు
  • మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు
  • 42వ డివిజన్‌లో ప్రజాసంక్షేమ-ప్రగతి యాత్ర

హన్మకొండ చౌరస్తా, జనవరి 29 : త్వరలో నిరుద్యోగులకు భృతి అందజేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. ప్రజా సంక్షేమ-ప్రగతి యాత్రలో భాగంగా శుక్రవారం హన్మకొండ 42వ డివిజన్‌ ప్రజలతో ఓ ఫంక్షన్‌హాల్‌లో కార్పొరేటర్‌ వీర గంటి రవీందర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టారన్నారు. 42వ డివిజన్‌లో రూ.27.50 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, మరో రూ.55 లక్షలతో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం చేపట్టిన సంక్షే మ పథకాలు, అభివృద్ధి గురించి తెలుసుకునేందుకే ప్రజాసంక్షేమ ప్రగతియాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గులాబీ జెండా ప్రజలకు అండగా నిలుస్తున్నదని అన్నారు. కొన్ని పార్టీల నాయకులకు టీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు బీజేపీలో ఉన్న కన్నెబోయిన రాజయ్యయాదవ్‌కు గుర్తింపు లభించకపోవడంతోనే టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని, ఆ తర్వాతే చైర్మన్‌ అయ్యారని తెలిపారు. ఆయన వేలాది మంది యాదవులకు గొర్రెలు పంపిణీ చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి రూ.1500తో పాటు ఉచితంగా బియ్యం ప్రభు త్వం అందజేసిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధినుంచి చేయూతనిస్తున్న ట్లు తెలిపారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలతో సీఎం కేసీఆర్‌ నిరుపేద కు టుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. రూ.500 కోట్లతో సీసీ రోడ్లు, పార్కు లు, కమ్యూనిటీహాల్‌తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికి 150 లీటర్ల మిషన్‌ భగీరథ నీరు పంపిణీ చేయనున్నట్లు మేయర్‌ తెలిపారు. కన్నెబోయిన రాజయ్యయాదవ్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్‌ సముచితస్థానం కల్పిస్తున్నారన్నారు. అనంతరం షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంత రం యాదవనగర్‌లో రూ.24 లక్షల తో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. రెడ్డికాలనీలో రూ.15 లక్షలతో చేపట్టి న సీసీ రోడ్డు పనులకు, రూ.26 లక్షలతో నిర్మించనున్న సగర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుందర్‌రాజ్‌, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్‌, కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, డివిజన్‌ అధ్యక్షుడు పాశికంటి రవిబాబు, సగర సంఘం నాయకులు కొడిపాక రమేశ్‌, వేణు, గోపాల్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo