బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 29, 2021 , 00:05:59

క్రేజీ ఫ్రూట్స్

క్రేజీ ఫ్రూట్స్

  • నగరంలో విదేశీ పండ్లకు యమ గిరాకీ 
  • అందుబాటులో పలు రకాల ఫలాలు
  • ఆరోగ్యరీత్యా ప్రజల ఆసక్తి

నగరంలో విదేశీ ఫలాలకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు ఫలానాదేశంలో పండే పండ్లు ఎంతో రుచిగా ఉంటాయని, వాటిని మనం ఎలా తినగలుగుతామని ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు ఏ దేశంలోని పండ్లయినా సరే వరంగల్‌ నగరానికి వస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య రీత్యా ఇవి మేలు చేస్తుండడంతో  ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. 

- హన్మకొండ చౌరస్తా 

విశ్వనగరంగా విస్తరిస్తున్న వరంగల్‌కు  ఎత్తున విదేశీ పండ్లు తరలివస్తున్నాయి. ఏ దేశంలోని పండ్లయినా సరే ఇక్కడ దొరుకుతున్నాయి. గతంలో పెద్దపెద్ద మాల్స్‌లో మాత్రమే విదేశీ ఫ్రూట్స్‌ కనిపించేవి.  ప్రస్తుతం నగరంలోని మార్కెట్లు, మాల్స్‌, రోడ్ల పక్కన దుకాణాల్లోనూ విదేశీ ఫ్రూట్స్‌ లభిస్తున్నాయి. విదేశాల నుంచి తరలివస్తున్న పండ్లతో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. విదేశాల నుంచి ప్రధానంగా ఆపిల్స్‌, కివి, డ్రాగన్‌ఫ్రూట్‌, మోసంబి, పియర్స్‌, అనార్‌, అంజీర్‌, ఆరెంజస్‌, ఆలుబుకారా, బ్లూబెర్రీ, చెర్రీ పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. సౌత్‌ఆఫ్రికా సంత్రాలు, ఆఫ్రికా అవకాడ, విదేశీ ఆపిల్స్‌లో రాయల్‌ గాలా, రెడ్‌ డెలీషియస్‌, న్యూజిలాండ్‌ గాలా, బ్రెజిల్‌ గాలా, చిలీ గాలా రకాలకు మంచి గిరాకీ ఉంటుందని  వ్యాపారులు చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నగరం పూర్తిగా విదేశీ పండ్లపైనే ఆధారపడింది. గ్రీన్‌ ఆపిల్‌ పండ్లు నెదర్లాండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ నుంచి వస్తున్నాయి. ఇక రాయల్‌ ఆపిల్‌గా చెప్పుకునే మరో రకం పండ్లు వాషింగ్టన్‌, న్యూజిలాండ్‌, బెల్జియం దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పండ్లలో మరో ముఖ్యమైనవి కివి ఫ్రూట్స్‌. ఇవి న్యూజిలాండ్‌, ఇటలీ, చైనా, ఇరాన్‌ వంటి దేశాల నుంచి వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇటీవల చాలా మంది ఎంతో ఇష్టంగా తింటున్న పండ్లలో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ కూడా ఉన్నాయి. ఇవి కూడా చైనా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. చెర్రీ పండ్ల విషయానికి వస్తే న్యూజిలాండ్‌ చాలా ప్రసిద్ధి చెందింది. రెడ్‌ గాలా పేరుతో లభించే ఆపిల్‌ పండ్లు ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.  

నగరవాసుల ఆసక్తి

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మార్కెట్లోకి వచ్చే విదేశీ ఫ్రూట్స్‌పై నగరవాసులు   చూపిస్తున్నారు. ఆరోగ్యం కోసం వినియోగిస్తున్న పండ్లలో ఎక్కువ శాతం విదేశాలకు చెందినవే ఉన్నాయి.  ఎన్నడూ రుచి చూడని విదేశీ పండ్లు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో వాటిని నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. వాటికి ఎంత ధర ఉన్నా కొనడానికి సిద్ధమవుతున్నారు.  ఐదేళ్ల నుంచి నగరానికి విదేశీ పండ్ల దిగుమతులు పెరిగినట్లు వ్యాపారులు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

అన్ని ఫ్రూట్స్‌ అందుబాటులో.. 

సీజన్‌కు సంబంధం లేకుండా అన్ని రకాల ఫ్రూట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల ఫ్రూట్స్‌ విదేశాల నుంచి తీసుకొస్తున్నాం. ఆరోగ్యాన్నిచ్చే ఫారిన్‌ ఫ్రూట్స్‌ పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు రాగా, అక్కడి నుంచి డీలర్‌ ద్వారా ఇక్కడికి వస్తున్నాయి. 

- ముదాసిఫ్‌, మదీనా ఫ్రూట్‌షాప్‌


VIDEOS

logo