అలరించనున్న సప్త స్వరాలు

- పదాక్షి గుట్ట సమీపంలో
- ‘సరిగమపదనిస’ పేరిట పార్కు
- రూ.50లక్షలతో నందనవనం ఏర్పాటు
- సంగీత ప్రియులకు ఆహ్లాదం పంచే వేదిక
- తెలుగు రాష్ట్రాల్లో వరంగల్‌లోనే మొదలు
- ఫిబ్రవరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు
చారిత్రక నగరిలో సరికొత్తగా మరో పార్కు అందుబాటులోకి రాబోతున్నది. హన్మకొండ పద్మాక్షి గుట్ట సమీపంలో ‘సరిగమపదనిస’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ నందనవనం తెలుగు రాష్ర్టాల్లో మొట్టమొదటిది. సప్తస్వరాలకు ప్రతీకలుగా ఏడు నృత్య భంగిమలతో ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు కాగా, ఫిబ్రవరి నెలాఖరులోగా పనులు పూర్తికానున్నాయి. ఇటు ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు సాయంత్రం వేళ ఏర్పాటు చేసే నృత్య ప్రదర్శనలతో ఈ ప్రాంతమంతా మార్మోగనున్నది.
హన్మకొండ, జనవరి 28 : సంగీత ప్రియులకు ఆహ్లాదం పంచేందుకు నగరంలో ‘సరిగమపదనిస’ పార్కు రూపుదిద్దుకుంటున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా లేనివిధంగా పద్మాక్షి ఆలయ పరిసరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య రీతుల భంగిమలు ఇందులో కనిపించనున్నాయి. సప్తస్వరాలకు ప్రతిరూపంగా ఏడు విగ్రహాలు, రెండు స్వాగత విగ్రహాలు నెలకొల్పారు. సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
ఒడిశా నుంచి సాండ్స్టోన్
విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందుకోసం సాండ్ స్టోన్‌ను ఒడిశా నుంచి తెప్పించి విగ్రహాలు చెక్కారు. దక్షిణ భారతంలోని నృత్య భంగిమలను తెలియజేసేలా వీటిని రూపొందించారు. ఓరుగల్లు నగరంలోని చారిత్రక ప్రాంతాల్లో విగ్రహాలు రాతిపై ఏర్పాటు చేసినట్లుగానే సరిగమపదనిస పార్కులో కూడా గ్రానైట్ బేస్‌పైనే విగ్రహాలు అమర్చుతున్నారు.
రూ.50లక్షలతో పనులు
పార్కు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు రూ.50లక్షలతో ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60శాతం పనులు పూర్తికాగా సంగీత ప్రియులతో పాటు సందర్శకులు, ప్రజల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కుడా ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. నృత్యం కోసం స్టేజీ, సందర్శకుల కోసం సీటింగ్, బెంచీలు, పార్కు ముందుభాగంలో గ్రానైట్‌తో తయారు చేసిన ఆర్చి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!