మంగళవారం 09 మార్చి 2021
Warangal-city - Jan 28, 2021 , 01:05:52

ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ‘ప్రభుత్వ స్లైన్‌'

ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ‘ప్రభుత్వ స్లైన్‌'

  • స్లైన్‌లో ఫంగస్‌ రావడంతో వెలుగులోకి..
  • సుమోటో విచారణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న అధికారులు

వరంగల్‌ చౌరస్తా, జనవరి 27 : ప్రభుత్వ స్లైన్‌ బాటిళ్లు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో వినియోగిస్తున్నట్లు బయటపడింది. వైద్యాధికారు లు తెలిపిన వివరాల ప్రకారం.. ము లుగురోడ్‌ సెంటర్‌లోని గార్డియన్‌ హాస్పిటల్‌లో నగరానికి చెందిన ఓ ఆర్‌ఎంపీ తన కుమారుడికి శస్త్రచికిత్స చేయించాడు. ఆ తర్వాత అం దించే వైద్యసేవల్లో భాగంగా మం గళవారం అర్ధరాత్రి స్లైన్‌ ఎక్కించగా అందులో ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించి అతడి కుటుంబసభ్యులు ఫోన్‌లో వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అదనపు వైద్యాధికారి మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే లిఖిత పూర్వకంగా వారు ఫిర్యాదు చేయకపోవడం, స్లైన్‌ బాటిల్‌ను అప్పగించకపోవడంతో వారు తిరుగుముఖం పట్టారు. ఈ విషయమై మదన్‌మోహన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని సుమోటాగా విచారణ చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ హాస్పటల్‌లో ఉండాల్సిన స్లైన్‌ బాటిళ్లు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో వినియోగించడం, ఫంగస్‌ పేరుకున్న స్లైన్‌ బాటిళ్లను సైతం సదరు గార్డియన్‌ హాస్పిటల్‌ యాజమాన్యం వినియోగించడంపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.


VIDEOS

తాజావార్తలు


logo