జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం

- పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు
- రూ. 8.8 కోట్లతో రైతు వేదికలు పూర్తి
- గణతంత్ర దినోత్సవాల్లోకలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు
- హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే నరేందర్
హన్మకొండ, జనవరి 26: పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హన్మకొండ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ఇందులో అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేశారని తెలిపారు. జిల్లాకు 11వేల 90 డోసుల కొవిడ్‌వ్యాక్సిన్ రాగా, 47 కేంద్రాల ద్వారా మొత్తం 5,337 మందికి టీకాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా 17,021 మంది వ్యాధిగ్రస్తులకు రూ.39 కోట్ల 48లక్షల 58వేలతో శస్త్ర చిక్సితలు చేయించామన్నారు. అలాగే ధరణి ద్వారా 2,725 వ్యవసాయ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, రైతు బంధు పథకం ద్వారా 2020 ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు 111 మంది మృతి చెందగా, ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ.5.55కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో 40 క్లస్టర్లలో రూ.8.8కోట్ల వ్యయంతో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేశామని, రూ.81.54 కోట్లతో గ్రేటర్ వరంగల్‌లో వివిధ రకాల 288 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగర సమగ్రాభివృద్ధిలో భాగంగా స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.2,352.18 కోట్లతో 94 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. షాదీముబారక్ కింద 483 మంది లబ్ధిదారులకు రూ.4,83,06,912, కల్యాణలక్ష్మి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలు కలిపి 2,659 మంది లబ్ధిదారులకు రూ.26,58,84,328లు ఆర్థిక సాయం అందించామన్నారు. జిల్లాలో పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. హయగ్రీవాచారి మైదానంలో రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం, రూ.3.49 కోట్లతో పురావస్తు శాఖాభివృద్ధి పనులు, రూ.69.88 లక్షలతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ పను లు చేపట్టామన్నారు. దివ్యాంగుల స్వయం ఉపాధి పథకం కింద ఏడుగురికి రూ.13.90 లక్షలతో ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, ల్యాప్‌టాప్‌లు అందజేశామన్నారు. ప్రీమెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, వివాహ ప్రోత్సాహకం కింద 32 మందికి రూ.6.50 లక్షలు లబ్ద్ధి చేకూరిందన్నారు. గొల్ల కురుమల జీవనోపాధి పెంచేందుకు బీ కేటగిరిలో 5,744 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు రూ.71.80కోట్లతో 1402 యూనిట్లను పంపిణీ చేశామన్నారు. మత్స్యకారుల అభివృద్ధికోసం 558 చెరువుల్లో రూ.86.26 లక్షల విలువచేసే కోటీ 51లక్ష 66వేల చేప పిల్లలను వేశామన్నారు. 4 చెరువుల్లో రూ.8లక్షల విలువ చేసే 4.25వేల రొయ్య పిల్లలు వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో 11.32 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు రూ.30.39కోట్ల ఖర్చు చేశామని కలెక్టర్ తెలిపారు. చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో 1524 మంది చేనేత కార్మికులకు రూ.35.68లక్షలు వారి ఖాతాల్లో జమచేశామని కలెక్టర్ తెలిపారు. వేడుకల్లో జిల్లా ప్రధాన జడ్జి ఎన్ నర్సింగారావు, మొదటి అదనపు జడ్జి కే జయ్‌కుమార్, సీపీ ప్రమోద్‌కుమార్, కలెక్టర్ సతీమణి విజయలక్ష్మి, నగర కమిషనర్ పమేలా సత్పతి, ఇన్చార్జి డీఆర్వో వాసుచంద్ర, అవార్డు గ్రహీతలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?