గురువారం 04 మార్చి 2021
Warangal-city - Jan 27, 2021 , 00:53:50

అందరి సహకారంతోనే నగరాభివృద్ధి

అందరి సహకారంతోనే నగరాభివృద్ధి

  • గ్రేటర్‌  కమిషనర్‌ పమేలా సత్పతి

వరంగల్‌, జనవరి 26 : అందరి సహకారంతోనే నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నగరాభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ అదేశాలతో ఉగాది నుంచి ఇంటింటికీ రోజూ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 82 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. బల్దియా బడ్జెట్‌లో 20 కోట్లు గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించామని తెలిపారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ నగరంలో రూ. 800 కోట్లతో అభివృద్ధి చేపట్టామని, అందులో రూ.300 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 86 మంది ఉద్యోగులకు ప్రశంసా ప్రత్రాలను కమిషనర్‌, మేయర్‌ అందజేశారు. కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్‌, చింతల యాదగిరి, మిర్యాల్‌కార్‌ దేవేందర్‌, బయ్య స్వామి, కత్తెరశాల వేణుగోపాల్‌, బైరబోయిన దామోదర్‌యాదవ్‌,యెలుగం లీలావతి, కావేటి కవిత, శామంతుల ఉషశ్రీ, మరుపల్ల భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ గోధుమల రాజు, వింగ్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

వరంగల్‌, జనవరి 26 : వరంగల్‌ మహా నగరపాలక సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు.. చీఫ్‌ ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, ఎస్‌ఈ విద్యాసాగర్‌, సిటీ ప్లానర్‌ నర్సింహరాములు, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, మెప్మా డీఎంసీ రజితారాణికి ప్రశంసా ప్రతాలు అందజేశారు. అదేవిధంగా కాకతీయ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌  అథారిటీ ఈఈ భీంరావు కూడా ప్రశంసాపత్రం అందుకున్నారు.


VIDEOS

logo