సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 27, 2021 , 00:51:11

ఉగాది నుంచి ఉచిత తాగునీరు

ఉగాది నుంచి ఉచిత తాగునీరు

  • నగరంలో పేదలకు మేలు
  • చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌
  • ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో జెండా ఆవిష్కరణ

హన్మకొండ, జనవరి 26 : వరంగల్‌ నగర ప్రజలకు వచ్చే ఉగాది పండుగ నుంచి రోజూ ఉచిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం చీఫ్‌విప్‌ మాట్లాడుతూ   దేశంలో ప్రజాస్వామ్యానికి మూల కారణం మన రాజ్యంగమేనన్నారు.  పొందుపరిచిన విధంగా ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వరంగల్‌ నగరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.  నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధ్దరణకు మిషన్‌ కాకతీయ, రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇలా అనేక రకలా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కేశవరెడ్డి, సుందర్‌రాజ్‌యాదవ్‌, జనార్దన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo