సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 25, 2021 , 00:21:53

కేటీఆర్‌ను ప్రజలు స్వాగతిస్తున్నారు

కేటీఆర్‌ను ప్రజలు స్వాగతిస్తున్నారు

  • ఆయన సీఎం కావాలని కోరుతున్నారు
  • జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం కావాలి
  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

మట్టెవాడ, జనవరి 24 : కేటీఆర్‌ సీఎం కావడాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.  ఆరేళ్లుగా కేటీఆర్‌ సమర్థవంతంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారన్నారు.  కల్పలత సూపర్‌బజార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ పంపులో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా విజేతలను ఆదివారం ఎంపిక చేసి, బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అభిప్రాయం మేరకు కేటీఆర్‌ సీఎం కావడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. అలాగే, దేశప్రజలందరూ కేసీఆర్‌ వైపు చూస్తున్నారన్నారు. లాభాల్లో నడుస్తున్న వ్యవస్థలను ప్రైవేట్‌ రంగానికి కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని, దీని వల్ల అనేక మందిపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. దీన్ని ఎదిరించాలంటే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌బజార్‌ ఎండీ జగన్‌మోహన్‌రావు, వైస్‌ చైర్మన్‌ షఫీ అహ్మద్‌, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, స్నేహలత, అయ్యాల దానం, టీఆర్‌ఎస్‌ నాయకుడు పరశురాములు పాల్గొన్నారు. కాగా, డ్రైవర్స్‌ డేను పురస్కరించుకుని నలుగురు డ్రైవర్లను చీఫ్‌విప్‌ సన్మానించారు. 

రైల్వే కార్మికుల క్రీడలు ప్రారంభం

కాజీపేట : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట రైల్వే జనరల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కార్మికులకు నిర్వహిస్తున్న బిలియర్డ్స్‌, క్యారం ఇండోర్‌ క్రీడలను చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రా రంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ రైల్వే క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.  రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్‌, ఇన్‌స్టిట్యూట్‌ సెక్రటరీ సుదర్శన్‌, సభ్యులు జానీ, అనిల్‌, ధన్‌రాజ్‌, వేదప్రకాశ్‌, రాజేశ్వర్‌రావు, నాయకులు సుందర్‌రాజ్‌, సోని, విజయ్‌రావు పాల్గొన్నారు. 

‘తేజోమయి’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మడికొండ : గ్రేటర్‌ 34వ డివిజన్‌ బాపూజీనగర్‌ పోచమ్మగుడి ఆవరణలో తేజోమయి మాలకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్యాల కృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌తో కలిసి చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బండి విజయ్‌కుమార్‌, కాళిక గౌరీశంకర్‌, కొమ్మాలు, కొండ్ర నర్సింగరావు, సిరిల్‌ లారెన్స్‌, బండి రాంచందర్‌, పడిదెల శేఖర్‌, చెలమల్ల రాజ్‌కుమార్‌, మైలారం శంకర్‌, కాళేశ్వరపు వెంకటేశ్‌, నీరటి సాయిరాజ్‌, గోవర్దన్‌, రాజు, వేణు పాల్గొన్నారు. 

టీపీఎస్‌ఏ ఆధ్వర్యంలో..

హన్మకొండ : తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(టీపీఎస్‌ఏ) నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ వేణు, ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అసోసియేషన్‌ బ్రాంచ్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ రఘునందన్‌, డాక్టర్‌ శ్రీధర్‌బాబు, డాక్టర్‌ శ్రీకాంత్‌, డాక్టర్‌ ఆంగోత్‌ బిక్కు, ఉపాధ్యక్షురాలు స్వాతి, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, నవ్యశ్రీ, ఉదయ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

VIDEOS

logo