శుక్రవారం 05 మార్చి 2021
Warangal-city - Jan 25, 2021 , 00:22:05

త్వరలో పీఆర్‌సీ శుభవార్త

త్వరలో పీఆర్‌సీ శుభవార్త

  • పెన్షనర్ల సమస్యకు సీఎం కేసీఆర్‌ సానుకూలం
  • ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం, చీఫ్‌ విప్‌ దాస్యం
  • రిటైర్డ్‌ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులతో సమావేశం
  • ప్రశ్నించే గొంతును గెలిపించాలని విజ్ఞప్తి

ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్‌సీ విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ శుభవార్త వెలువరించనున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం హన్మకొండలోని కడియం నివాసంలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి రిటైర్డ్‌ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఇక్కడ వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.

సుబేదారి, జనవరి 24 : తెలంగాణ ప్రభుత్వం త్వరలో పీఆర్‌సీ శుభవార్త చెప్పనుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన రిటైర్డు ఉద్యోగులు  ,ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమావేశం పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. కేంద్రం ప్రభు త్వం రాష్ట్ర విభజనచట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 17 జాతీయ సంస్థలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.  సమస్యలను సీఎం దృష్టికి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, పెన్సనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నరసింహారెడ్డి, హుసేన్‌, రాజలింగం, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సీతారామారావు, ప్రొఫెసర్‌ రమేశ్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

మాయ మాటలు నమ్మొద్దు

దామెర, జనవరి 24: గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధర లు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మొద్దని రైతుబంధు సమితి రాష్ట్ర కన్వీనర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ములుగురోడ్డులోని కేఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలకోసం ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగానే మిషన్‌భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. త్వరలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇవన్నీ బీజేపీ నాయకుల కు కనబడడం లేదా.. అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు.  త్వరలో నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు.  

‘పల్లా’ గెలుపు ఖాయం : చల్లా 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఎక్క డా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తుండడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని అన్నా రు. సమావేశంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకన్న, ఎంపీపీలు కాగితాల శంకర్‌, స్వర్ణలత, అనసూయ, కళావతి నరహరి, జడ్పీటీసీ మొగిలి, సుమలత, గూడ సుదర్శన్‌రెడ్డి, గరిగె కల్పన, వైస్‌ ఎంపీపీ జాకీర్‌అలీ, పరకాల, ఆత్మకూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బొజ్జం రమే శ్‌, కాంతాల కేశవరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ భిక్షపతి, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షులు అశోక్‌, నాగిరెడ్డి, సంజీవరెడ్డి, కమలాకర్‌, సారంగపాణి, యూత్‌ అధ్యక్షులు సనత్‌, రఘుపతి, నవీన్‌, విష్ణు, ప్రమోద్‌, బాలకృష్ణ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo