ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 24, 2021 , 01:37:09

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

వరంగల్‌ చౌరస్తా, జనవరి 23 : హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరె స్ట్‌ చేశారు. వరంగల్‌ నగరంలోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గిరికుమార్‌ వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోని లక్ష్మీ టౌన్‌షిప్‌కు చెందిన కోమటి సరస్వతి తన కుమారుడు విజయ్‌ కనిపించడం లేదని ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిమల్ల రాంకీపై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అదేరోజు సంగెం మం డలం కొత్తగూడెం పరిధి కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసు లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనుమానితుడు రెడ్డిమల్ల రాంకీ, రెడ్డిమల్ల యామినితో కలిసి నగరం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మృతుడు కోమటి విజయ్‌, రెడ్డిమల్ల యామిని ప్రేమించుకున్నా రు. వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రెడ్డిమల్ల రాంకీ(మృతుడి మిత్రుడు) వరుసకు సోదరైన రెడ్డిమల్ల యామిని(28)తో చనువు పెంచుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గతంలో విజయ్‌ తో దిగిన ఫొటోల విషయాన్ని యామిని రాం కీతో చెప్పింది. తనకు నిత్యం ఫోన్‌ చేస్తూ వే ధింపులకు పాల్పడుతున్నట్లు చెప్పడంతో విజయ్‌ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా జనవరి 4వ తేదీన రాంకీ ఫోన్‌ చేసి విజయ్‌ని తన ఇంటికి పిలిపించుకున్నాడు. నిందితుడు రాంకీ కారులో నగరంలోని పలు ప్రాంతాలకు తిప్పుతూ గీసుగొండ మండలం పరిధిలోని కాకతీయ కెనాల్‌ ప్రాం తంలో మద్యం సేవించారు. మద్యం మత్తు లో ఉన్న విజయ్‌పై నిందితుడు రాంకీ దాడిచేసి కెనాల్‌లోకి తోసేశాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. నిందితులు అ ప్రమత్తమై నగరం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచనున్నట్లు వివరించారు.


VIDEOS

logo