‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్

- రిజర్వేషన్ ప్రకటనపై అగ్రవర్ణాల హర్షం
- కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నేతలు
హన్మకొండ/ సుబేదారి, జనవరి 22: ఈడబ్ల్యూసీ రిజర్వేషన్‌తో అగ్రవర్ణ పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకు న్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఓసీ ‘జాక్' నాయ కులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. అగ్రవర్ణాలకు న్యాయం చేసేందుకు 2019లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణ ం తీసుకున్నా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్‌తో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశాలు ఏర్పడుతాయన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, వల్లూరి పవన్‌కుమార్, రంగనాథా చార్యులు మంత్రి కేటీఆర్‌కు ఆశీర్వచనం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గోపు జయ్ పాల్ రెడ్డి, కేశవరెడ్డి, పొలాడి రామారావు, చెన్నమనేని నాగేశ్వర్రావు, పురుషోత్తం రావు, పర్వతినేని ప్రసాద్‌రావు, రంగారావు, రాజేందర్గుప్త, కుందారాపు శ్రీనివాస్‌గుప్త పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
భీమారం, జనవరి 22 : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి 57వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి పాలాభిషేకం చేశారు. హనుమాన్ నగర్ జంక్షన్లో శుక్రవారం కే శ్రీనివాస్‌రెడ్డి, దూలం రాంబాబు, మొట్ల మనోహర్, సాదుల రఘుపతి, ఎండీ రుక్ముద్దీన్, రాజ్ కుమార్, ఉదయ్, వెంకటేశ్, కిరణ్‌తో కలిసి పాల్గొన్నారు.
తాజావార్తలు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా