ఎనీ బుక్ @ ఇంటర్నెట్

- విద్యార్థులకు అందుబాటులో ఈ-బుక్స్
- పోటీ పరీక్షల అభ్యర్థులకు మోడల్ పేపర్స్
- రిసెర్చ్ స్కాలర్స్‌కు అవసరమైన జర్నల్స్
- ప్రతీది అంతర్జాలంలో నిక్షిప్తం
ఇంటర్నెట్ యుగమిది. మానవుడి జీవితంలో ఒక భాగమైంది. నెట్ సౌకర్యం ఉంటే చాలు సెల్ఫోన్లు, కంప్యూటర్లలో ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో మనముందు ఉంటున్నది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ విద్యావిధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి దీని వాడకం మరింత పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు తమకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా పొందుతున్నారు. గూగుల్ సెర్చ్‌లో పుస్తకం పేరు ఎంటర్ చేస్తే క్షణాల్లో సమాచారం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.
- హన్మకొండ చౌరస్తా, జనవరి 22
ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ వంటి టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఉన్నత పాఠశాలల్లోనూ కంప్యూటర్ శిక్షణ తప్పనిసరిగా మారింది. ఇంటర్ ఆపై కోర్సులు చదివే విద్యార్థులు ఎక్కువగా ‘ఈ-చదువు’పైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక నిపుణులు వివిధ రకాల పుస్తకాలను ఈ బుక్స్ రూపంలో ఇంటర్నెట్లో పెడుతున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు పదుల సంఖ్యలో పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం చొప్పున కొనాలంటే కొంచెం కష్టమే. ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులకైతే లెక్కలేనన్ని పుస్తకాలు రెఫర్ చేయాలి. కళాశాలల్లో లైబ్రెరీలు అందుబాటులో ఉన్నా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక నిపుణులు ఒక్కో సైట్లో వందలాది ఈ-బుక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీ పరీక్షల తీరు తెన్నులను తెలుసుకోవడానికి పాత ప్రశ్నపత్రాలు, మెటీరియల్, అకడమిక్ పుస్తకాలు ఇలా ప్రతీది నెట్ ద్వారా పొందేలా పుస్తకాలను అందుబాటులో ఉంచా రు. వీటితో పాటు టీఎస్పీఎస్సీ, సివిల్స్, డీఎస్సీ, గ్రూప్స్, బ్యాం కు, రైల్వే ఉద్యోగాల మెటీరియల్స్, మోడల్ పేపర్స్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఎన్నో ప్రయోజనాలు..
ఈ-బుక్స్‌తో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యావిధానంలో వస్తున్న మార్పులకనుగుణంగా చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఇంటర్నెట్పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా ఈ-చదువులపైనే ఆధారపడుతున్నారు.
- తాళ్ల సంపత్, టైలర్, కుమార్‌పల్లి
పోటీ పరీక్షల కోసం..
పోటీ పరీక్షల కోసం వివిధ రకాల పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నె ట్ హవా కొనసాగుతోంది. వందలాది పుస్తకాలు నెట్లో దర్శనమిస్తున్నాయి. ఈ బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. వివిధ రకా ల పుస్తకాలను నెట్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- రాజశేఖర్, హన్మకొండ
అందుబాటులో జర్నల్స్..
పలు వెబ్సైట్లు జర్నల్స్‌ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నా యి. వివిధ దేశాల్లో చేస్తున్న పరిశోధనలను ఇంటర్నెట్లో లభ్యమయ్యే జర్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మనకు కావాల్సిన పూర్తి సమాచారం కోసం ఎన్నో పుస్తకాలు లభిస్తున్నాయి.
- కంజర్ల మనోజ్‌కుమార్, రిసెర్చ్ స్కాలర్, కేయూ
తాజావార్తలు
- భారీ ఆఫర్‌కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’