బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 23, 2021 , 00:11:46

కార్పొరేట్‌కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి

కార్పొరేట్‌కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి

  • చేనేత జౌళిశాఖ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తస్నీమ్‌ 
  • వరంగల్‌ వీవర్స్‌కాలనీలో చేనేత కార్మికులకు శిక్షణ ప్రారంభం

పోచమ్మమైదాన్‌, జనవరి 22 : చేనేత ఉత్పత్తుల తయారీలో కార్మికులకు నైపుణ్యం పెంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళిశాఖ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ తస్నీమ్‌ అత్తర్‌ జహాన్‌ అన్నారు. వరంగల్‌ దేశాయిపేట వీవర్స్‌కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రేమ్‌ మగ్గాలపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు శిక్షణను సద్వినియోగం చేసుకుని కార్పొరేట్‌కు దీటు గా నాణ్యమైన, వివిధ డిజైన్ల చేనేత ఉత్తత్తులను తయారు చేయాలన్నారు. ఇప్పటికే కొ త్తవాడలో తయారు చేస్తున్న జంపఖానలు, బెడ్‌షీట్లు అంతర్జాతీయ స్థాయిలో పేరు పొం దాయన్నారు. ప్రత్యేకంగా సూటింగ్స్‌, షర్టిం గ్స్‌, తాన్‌ వస్ర్తాల ఉత్పత్తుల కోసం ప్రభుత్వం చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుందని తెలిపా రు. ముందుగా ఆధునిక పద్ధతుల ద్వారా ఫ్రే మ్‌ మగ్గాలపై నేస్తున్న వస్ర్తాలపై కార్మికుల్లో అ వగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ప లు చేనేత సంఘాల్లో ఎంపిక చేసిన కార్మికులకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తూ, రోజుకు రూ. 210 చొప్పున ైస్టెఫండ్‌ అందజేస్తారని వివరించారు. దశలవారీగా శిక్షణ ఇస్తూ, ఉ త్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. హ్యాండ్లూమ్స్‌ ఓఎస్‌డీ బీ రతన్‌కుమార్‌, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హిమజకుమార్‌, వరంగల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జీ రాఘవరావు, టెస్కో డీఎం వో పురాణం శ్రీనివాస్‌, టీఎస్‌ఎన్‌ రెడ్డి, డీవో బీ వెంకటేశ్వర్లు, ఏడీవోలు ఎస్‌ రవీంద్ర, బీ వెంకటేశ్వర్లు, పలు సంఘాల పర్సన్‌ ఇన్‌చార్జిలు, కార్మికులు పాల్గొన్నారు. కాగా, వీవర్స్‌కాలనీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వరంగల్‌లోని ఉప్పు మల్లయ్య తోట, ఎల్‌బీ నగర్‌ చేనేత సహకార సంఘాలకు సంబంధించిన 20 మంది చేనేత కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు.


VIDEOS

logo