మంగళవారం 09 మార్చి 2021
Warangal-city - Jan 22, 2021 , 01:11:38

అందరి సహకారంతో అభివృద్ధి

అందరి సహకారంతో అభివృద్ధి

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

కరీమాబాద్‌, జనవరి 21 : అందరి సహకారంతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రమిగా నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. గురువారం 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో డివిజన్‌లో దాదాపు రూ.65 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో, మంత్రి కేటీఆర్‌ అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలకు అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.  కోఆప్షన్‌ సభ్యురాలు బత్తిని వసుంధర, కుడా అడ్వైజరీ బోర్డు మెంబర్‌ మోడెం ప్రవీణ్‌, నాయకులు మరుపల్ల రవి,  కోటేశ్వర్‌, ఆరెల్లి రవి, గడ్డం యుగేంధర్‌, వనం కుమార్‌, నర్మెట కుమారస్వామి, పసునూరి రమేశ్‌, గుడిమెల్ల రాజు, మరుపల్ల గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo