సోమవారం 08 మార్చి 2021
Warangal-city - Jan 22, 2021 , 01:11:36

అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి

శాయంపేట, జనవరి 21 : రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పపర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. శాయంపేట ఎంపీడీవో ఆఫీస్‌లో పలువురు లబ్ధిదారులకు గురువారం ఆమె సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ  అన్ని వర్గాల ప్రజలు ఏదో రూపంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుతోందన్నారు. నియోజకవర్గంలో 80 మందికిపైగా రూ.లక్షల ఎల్‌వోసీలను ఇప్పించినట్లు చెప్పారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ కింద 14 మంది లబ్ధిదారులకు రూ.4.40లక్షల చెక్కులను అందజేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కును అందజేశారు. అంతకు ముందు శాయంపేట పీహెచ్‌సీని జడ్పీ చైర్‌పర్సన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో వైద్య సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. కాగా, హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌బాబు, వైస్‌చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ కందగట్ల రవి పాల్గొన్నారు.  

VIDEOS

logo