సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 21, 2021 , 00:57:24

విగ్రహావిష్కరణకు రండి..

విగ్రహావిష్కరణకు రండి..

  • హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు ఆహ్వానం

భీమదేవరపల్లి, జనవరి 20: స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత పడాల చంద్రయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని విగ్రహ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎదులాపురం తిరుపతి, దొంగల కొమురయ్య, వానమామలై బుజ్జన్న, గొల్లపల్లి లక్ష్మయ్య, బొజ్జపురి రామకృష్ణ తదితరులు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రయ్య క్విట్‌ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపారని వివరించారు. ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు స్థాపనలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ములుకనూరులోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో త్వరలో ఏర్పాటు చేయను న్న పడాల చంద్రయ్య విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరగా, ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు.  


VIDEOS

logo