మంగళవారం 09 మార్చి 2021
Warangal-city - Jan 21, 2021 , 00:57:22

క్రీడా శిక్షణకో ఊరు..

క్రీడా శిక్షణకో ఊరు..

  • మామునూరు సమీపంలో ‘స్పోర్ట్స్‌ విలేజ్‌' 
  • అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు
  • గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఐదున్నర ఎకరాల్లో నిర్మాణం
  • రూ.5 కోట్లతో సరికొత్త ప్రాజెక్టు
  • ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ క్రీడలు, రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌కు ప్రత్యేక శిక్షణ 
  • స్టేడియంతోపాటు క్రీడాకారులకు హాస్టళ్లు  
  • 26న భూమి పూజకు ఏర్పాట్లు

వరంగల్‌, జనవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటు కానున్నది. ఇప్పటికే టూ రిజం, ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉన్న వరంగల్‌లో సమీకృ త స్పోర్ట్స్‌ విలేజ్‌ రానున్నది. క్రీడలు, క్రీడాకారులకు వరంగల్‌ ఇక నుంచి కొత్త చిరునామాగా మారనుంది. మామునూరు సమీపంలోని తిమ్మాపూర్‌లో ఐదున్నర ఎకరాల్లో స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మాణానికి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ పాలకవర్గం ఇటీవలే నిర్ణ యం తీసుకుంది. భూమి పూజ కార్యక్రమాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ అధికారులు స్పోర్ట్స్‌ విలేజ్‌ కోసం కేటాయించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు జక్కలొద్ది ప్రాంతంతో అంత ర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని హామీ లు ఇచ్చారు. అవి ఆచరణలోకి తీసుకురాకుండా వరం గల్‌ నగరంపై వివక్ష చూపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారు లను సిద్ధం చేసేందుకు వీలుగా స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మాణం చేపడుతోంది.  

క్రీడలకు ఊతం..

క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి వరంగల్‌లో నిర్మిం చనున్న స్పోర్ట్స్‌ విలేజ్‌ తోడ్పడనుంది. వేగంగా విస్తరి స్తున్న నగర జనాభాకు అనుగుణంగా ఇందులో ఏర్పా ట్లు ఉండనున్నాయి. వరంగల్‌ నగరంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల క్రీడాకారుల శిక్షణకు ఇది ఉపయోగ పడనుంది. ఇందులో కోచ్‌లు, ఇతర సిబ్బందితో కలు పుకుని వందల మందికి ఉపాధి కలుగనుంది. 

క్రీడల శిక్షణకు వేదిక..

తిమ్మాపూర్‌లో నిర్మించనున్న స్పోర్ట్స్‌ విలేజ్‌ అన్ని క్రీడల శిక్షణకు వేదిక కానుంది. ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్పోర్ట్స్‌కు శిక్షణ ఇచ్చేలా ఈ విలేజ్‌ నిర్మాణ ప్రణాళిక ఉంది. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మించనున్నారు. మొదట ప్రహరీ, షూటింగ్‌ టార్గె ట్‌ వాల్‌ను నిర్మించనున్నారు. దశల వారీగా ఇతర క్రీడా స్థలాలు, క్రీడాకారులకు వసతులను ఏర్పాటు చేయనున్నారు. రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌ శిక్షణ ప్రత్యేకతగా ఉంటుంది. మామూనూరు నాలుగో బెటాలియన్‌కు అతి సమీపంలోనే ఈ స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మిస్తున్న నేపథ్యంలో మొదట రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌ శిక్షణ చేసుకునేలా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా షూటింగ్‌ టార్గెట్‌ వాల్‌  నిర్మాణంపై జీడబ్ల్యూఎంసీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే రైఫిల్‌, పిస్టల్‌ షూటింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది నెల వారీ శిక్షణ కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. తి మ్మాపూర్‌లో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ విలేజ్‌లో ఈ వసతులు ఉండనున్నాయి. 


VIDEOS

logo