గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 20, 2021 , 01:51:37

అంగన్‌వాడీలకు డ్రెస్‌కోడ్‌..

అంగన్‌వాడీలకు డ్రెస్‌కోడ్‌..

  • టీచర్లకో కలర్‌, ఆయాలకు మరో కలర్‌ .. జిల్లాలకు చేరిన చీరలు
  • ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీకి సిద్ధం
  • ఏర్పాట్లు చేస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

హన్మకొండ, జనవరి 19 : అంగన్‌వాడీ సెంటర్లను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల కు పౌష్టికాహారం అందించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా చూస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం తో పాటు పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్య ను అందిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, ఇతర విధుల్లోనూ అంగన్‌వాడీ సిబ్బంది పాలు పంచుకుంటోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం వీరిని అన్ని విధాలా ఆదుకునేలా ప్రణాళిక రూపొందించింది. ఇం దులో భాగంగా మొదట అంగన్‌వాడీ వర్కర్లుగా పిలుచుకునే వీరిని అంగన్‌వాడీ టీచర్లుగా మారుస్తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. వేతనాలు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. ప్రస్తుతం వీరికి డ్రెస్‌ కోడ్‌ ఏర్పా టు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చీరలు అందజేసేందుకు సంకల్పించారు. ఇందుకుగాను ‘టెస్కో’ ఆధ్వర్యంలో చీరలు సిద్ధం చేయించారు. వీటిని స్త్రీ,శిశు సం క్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కార్యాలయాలకు చీరలు చేరుకోగా పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు 3,142 చీరెలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పంపిణీ చేసేందుకు కొత్త చీరలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన, మినీఅంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 799 కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు మొత్తం 3, 142 చీరెలు పంపిణీ చేయనున్నారు. వీటిలో హన్మకొండ అర్బన్‌ ప్రాజెక్టుకు 1072 చీరెలు రాగా 542 అంగన్‌వాడీ టీచర్లకు, 530 ఆయాలకు పంపిణీ చేయనున్నారు. వరంగల్‌ అర్బన్‌ ప్రాజెక్టుకు 1176 చీరెలు రాగా, 592 అంగన్‌వాడీ టీచర్లకు, 584 ఆయాలకు, భీమదేవరపల్లి ప్రాజెక్టుకు 894 చీరెలు రాగా, 464 టీచర్లకు, 430 ఆయాలకు అందజేయనున్నారు. 

ప్రజాప్రతినిధుల సమక్షంలో...

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చీరెలను ఆయా ప్రాజెక్టు పరిధిలోని ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల సమ యం ప్రకారం ఏఏ ప్రాంతంలో ఏ రోజు పంపిణీ చేయాలనే షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.

త్వరలో పంపిణీ చేస్తాం

అంగన్‌వాడీ టీచర్లు, ఆ యాలకు కొత్త డ్రెస్స్‌ కోడ్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  మంత్రి సత్యవతిరాథోడ్‌ సోమవారం చీరెలు పంపణీ చేశారు. వాటిని సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో భద్రపరిచాం. ప్రజాప్రతినిధుల సమయాన్ని అనుసరించి పంపిణీ చేయాలని సీడీపీవోలను ఆదేశించా. 

-ఎం.శారద,జిల్లా సంక్షేమాధికారి 


VIDEOS

logo