సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 20, 2021 , 01:51:34

విలీన గ్రామాల్లో ప్రగతి పరుగులు

విలీన గ్రామాల్లో  ప్రగతి పరుగులు

  • 42 ఊర్లకు రూ. 252 కోట్ల నిధులు
  • మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
  • వివిధ దశల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు

వరంగల్‌, జనవరి 19 : విలీన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో చేపట్టనున్న పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసింది. వీటితో  మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు బల్దియా పాలకవర్గం ప్రణాళిక రూపొందించింది. గ్రేటర్‌ కార్పొరేషన్‌లో విలీనమైన 42 గ్రామాల అభివృద్ధికి బల్దియా జనరల్‌ ఫండ్‌తో పాటు సీఎంఏ, ఎస్సీ, ఎస్టీ గ్రాంట్‌, ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎంపీ ఫండ్స్‌ రాకతో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. గ్రామాల అభివృద్ధికి రూ. 252.15 కోట్ల నిధులు కేటాయించి 2,211 అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటితో పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ఈ నిధులతో ప్రతి గ్రామం లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో గ్రామాలు కొత్తకళను సంతరించుకోనున్నాయి.

అభివృద్ధికి పెద్దపీట

రెండేళ్లలో విలీన గ్రామాల అభివృద్ధికి రూ. 252.15 కోట్లు కేటాయించారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ. 96. 40 కోట్లు కేటాయించి 1424 అభివృద్ధి పనులు చేపడుతున్నా రు. రూ. 2.51 కోట్ల ఎస్సీ,ఎస్టీ గ్రాంట్‌ నుంచి 40 పనులు చేపట్టారు. రూ. 99.29 కోట్ల సీఎం హామీ నిధులతో 399 పనులు, రూ.10.37 కోట్ల పట్ణణ ప్రగతి నిధులతో 51 పను లు, రూ.10 కోట్ల కార్పొరేటర్‌ ఫండ్‌తో 121 పనులు, రూ. 19.55 కోట్ల వరద నిధుల నుంచి 110 పనులు, ఎంపీ నిధు లు రూ.9 లక్షలతో 2 పనులు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ. 13.90 కోట్లతో 64 అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 90 కోట్లకు సంబంధించిన 1306 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూ. 32 కోట్లకు సంబంధించిన 203 అభివృద్ధి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రూ. 130 కోట్లకుతో చేపట్టనున్న 702 అభివృద్ధి పనులు టెండర్‌ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.  

మౌలిక వసతుల కల్పన

విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పార్కుల ఏర్పాటుపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. పట్టణ ప్రగతి నిధులతో గ్రామాల్లో వైకుంఠధామాలు అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్గత రోడ్ల అభివృద్ద్ధిపై దృష్టి సారిస్తున్నారు. 


VIDEOS

logo