ఆదివారం 07 మార్చి 2021
Warangal-city - Jan 20, 2021 , 01:51:33

పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం

పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం

  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ, జనవరి 19 :  పేదల ఆరోగ్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కే మాధవీరెడ్డి, వేములు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సుందర్‌రాజ్‌యాదవ్‌, పులి రజినీకాంత్‌, వీరగంటి రవీందర్‌ పాల్గొన్నారు. 

ప్రజాసంక్షేమ ప్రగతి యాత్రకు స్పందన

ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. అలాగే ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.  సమావేశంలో వరంగల్‌ ఆర్డీవో వాసుచంద్ర, మున్సిపల్‌ అడిషనల్‌ కమిషనర్‌ నాగేశ్వర్‌రావు, ఎన్పీడీసీఎల్‌ ఏడీఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

రైల్వే డివిజన్‌, కోచ్‌ ఫ్యాక్టరీ సాధనకు ముందుకెళ్లాలి

కాజీపేట :  కాజీపేటలో రైల్వే డివిజన్‌, కోచ్‌ ఫ్యాక్టరీని సాధించేందుకు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ పరిధిలో రైల్వే వ్యాగన్‌ పీవోహెచ్‌ షెడ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని రైల్వే శాఖకు అప్పగించినందుకు గాను ప్రభు త్వ చీఫ్‌ విప్‌ను మంగళవారం తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్‌ జాక్‌ ప్రతినిధు లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు జాక్‌ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడానికి కార్యాచరణ రూపొందించినట్లు వారు చీఫ్‌విప్‌కు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో పాక ఓంప్రకాశ్‌,  సంతోష్‌కుమార్‌, అగ్గి రవీందర్‌, దేవులపల్లి రాఘవేందర్‌, కొండ్ర నర్సింగరావు, ప్రేమ్‌కుమార్‌, రేడ్ల రమేశ్‌, కెంచు రాజు, బెల్లం రమేశ్‌ ఉన్నారు. 

VIDEOS

logo