గురువారం 04 మార్చి 2021
Warangal-city - Jan 17, 2021 , 02:15:43

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

  • ఉగాది వరకు వారాంతపు జాతరలు  
  • అర్ధపానవట్టం లింగానికి అన్నపూజ  

ఐనవోలు, జనవరి 16 : సుప్రసిద్ధ శైవకేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో శనివారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజులపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా దేవాలయ ఆవరణలో భక్తులు బోనాలు చేసి, పట్నాలు వేశారు. లక్షలాది మంది భక్తులు దేవాలయ పరిసరాలు, దేవాలయ ఆవరణ, గర్భాలయంలో విడిది చేశారు.  ఆలయ సంప్రదాయం ప్రకారం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌ ఆధ్వర్యంలో  వేద పండితులు, అర్చకులు పవిత్రమైన జలంతో తెల్లవారుజాము నుంచే మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి, రేణుకా ఎల్లమ్మ దేవాలయాలను సంప్రోక్షణ(కడుగడం) చేశారు. అర్చకులు స్వచ్ఛమైన జలం, సుగంధద్రవ్యాలు, నవధాన్యాలను కలశంలో కలిపి  చల్లారు. అనంతరం దేవాలయంలో ఉన్న అర్ధపానవట్టం లింగానికి అర్చకులు అన్నపూజ నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శివలింగాన్ని అన్నంతో అలంకరించారు. ఈనెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఉగాది వరకు ప్రతి ఆదివారం, బుధవారం వారాంతపు జాతరలు జరుగుతాయి. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌ (సమ్మయ్య), ఈవో నాగేశ్వర్‌రావు, వేద పండితుడు పురుషోత్తంశర్మ, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌శర్మ, ముఖ్య అర్చకులు శ్రీనివాస్‌శర్మ, మధుశర్మ, భీమన్న, నరేశ్‌శర్మ (చిక్క), భానుశర్మ, శ్రీనివాస్‌శర్మ, సిబ్బంది కిరణ్‌, మధుకర్‌, నారాయణరావు, శ్రీకాంత్‌, రాజు, కన్నయ్య, రాజు, రాజులు, డైరెక్టర్లు వెంకట్‌రెడ్డి, రాజు, సతీశ్‌, దేవేంద్ర, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo