శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 17, 2021 , 02:15:39

టీఆర్‌ఎస్‌ నాయకుడి పేరిట నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతా

టీఆర్‌ఎస్‌ నాయకుడి పేరిట నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతా

  • డబ్బులు పంపాలని 123 మందికి రిక్వెస్ట్‌
  • అప్రమత్తమైన బాధితుడు అశోక్‌

ఖిలావరంగల్‌, జనవరి 16 : సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పోలీసు అధికారులు, వివిధ విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలను తెరిచి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా శివనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు మేరుగు అశోక్‌ పేరుతో నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాను సృష్టించిన నేరగాళ్లు 123 మందికి స్నేహితులకు రిక్వెస్ట్‌ పంపించారు. దవాఖానలో చికిత్స పొందుతున్నానని అత్యవసరంగా రూ.20 వేలు కావాలంటూ 15 మందితో చాట్‌ చేశారు. 9050788413, 9587697071, 907704695 నంబర్లకు గూగుల్‌ పే లేదా ఫోన్‌పే చేయాలని అభ్యర్థించారు. అయితే, శివనగర్‌లో అందరికి ఆర్థిక సాయం చేసే మేరుగు అశోక్‌ తనకు డబ్బులు కావాలంటూ కొత్త నంబర్లను జోడించడంపై అనుమానం వచ్చించింది. ఆయన వ్యక్తిగత నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ను వెళ్లారు. అయితే, ఇదంతా కామన్‌.. లైట్‌గా తీసుకోండి అని చెప్పడంతో కంగుతిన్న బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సాయంతో నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాను తొలగించుకున్నాడు. కాగా, తన పేరు మీదా ఎవరైన డబ్బులు అడిగితే ఇవ్వకూడదంటూ ఈ సందర్భంగా అశోక్‌ విజ్ఞప్తి చేశారు.  


VIDEOS

logo