టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు

- తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
- దేశాయిపేట యూహెచ్‌సీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
పోచమ్మమైదాన్, జనవరి 16 : ప్రపంచాన్ని వణికించిన కరోనాను అంతం చేయడానికి వ్యాక్సిన్ వచ్చేసిందని, ఇక ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కొవిడ్-19 వాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎన్‌వో కుమార్ తొలి టీకా వేయించుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు ముందుండి ప్రజలకు అండగా నిలిచారన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామన్నారు. ప్రస్తుతం టీకా రావడం శుభ పరిమాణం అన్నారు. ముందుగా ప్రాణాలు లెక్కచేయకుండా వైద్య సేవలు అందించిన సిబ్బందికి టీకాలు ఇచ్చిన తర్వాత దశలవారీగా మిగతా వారికి ఇస్తారని ఆయన వివరించారు. కరోన వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం చేయకుండా అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డీఎంహెచ్‌వో లలితాదేవి మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ వారానికి నాలుగు రోజులే ఉంటుందని, మిగతా రోజుల్లో ఇతర వైద్య సేవలను అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొవిషీల్డ్ టీకాను ఎంపిక చేసిన వైద్య సిబ్బందికి 5 ఎంఎల్ చొప్పున ఇస్తామని, టీకా వేయించుకున్న తర్వాత నిరంతరం అబ్జర్వేషన్ చేస్తామన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావని, ఇబ్బందులు వస్తే ఎంజీఎంలో తక్షణ వైద్య సేవలకు ఏర్పా ట్లు చేశామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కావటి కవిత రాజు యాదవ్, యెలుగం లీలావతి సత్యనారాయణ, శారద సురేశ్ జోషీ, తూర్పాటి సులోచన సార య్య, వీర భిక్షపతి, వద్దిరాజు గణేశ్, దామోదర యాదవ్, రిజ్వానా షమీమ్ మసూద్, కోఆప్షన్ మెంబర్ బత్తిని వసుంధర, డాక్టర్ హరిరమాదేవి, ప్రొగ్రాం ఆఫీసర్ పీఎస్ఎస్ మల్లికార్జున్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ భరత్‌కుమార్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ దుర్గాప్రసాద్, సూపర్వైజర్లు జన్ను కోర్నెలు, రాజేంద్రప్రసాద్, మల్లేశం పాల్గొన్నారు. కాగా, దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్లో తొలిరోజు 30 మంది వైద్య సిబ్బందికి టీకా ఇచ్చారు. మళ్లీ వారికి 28 రోజుల తర్వాత రెండో టీకా వేస్తారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- మళ్లీ మాస్కు కట్టండి
- పాలమూరు వాణి
- 26-02-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు