బుధవారం 27 జనవరి 2021
Warangal-city - Jan 14, 2021 , 00:31:21

మల్లన్నా.. శకణు శకణు

 మల్లన్నా.. శకణు శకణు

  • శివసత్తుల పూనకాలు, ఢమరుక నాదాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగుతున్న ఆలయ ప్రాంగణం
  • నేడు మకర సంక్రాంతి సందర్భంగా మహానివేదన ఐనవోలు జనసంద్రం
  • భోగి నుంచే జాతరకు పోటెత్తుతున్న భక్తజనం
  • బోనాలు, పట్నాలతో ఆధ్యాత్మిక శోభ

దారులన్నీ ఏకమై ఐనవోలు వైపు బండ్లు పరుగులు తీస్తున్నాయి. భోగి పండుగ నుంచి మల్లికార్జునుడి జాతర అట్టహాసంగా ప్రారంభం కాగా, తొలిరోజు బోనాలు, పట్నాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మరోవైపు శివసత్తుల పూనకాలు, ఢమరుక నాదాలు, డప్పుచప్పుళ్లతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నేడు మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి మహా నివేదన కార్యక్రమం నిర్వహించనుండగా భక్తజనం పోటెత్తనున్నది.

  • ఐనవోలు జనసంద్రం
  • భోగి నుంచే జాతరకు పోటెత్తుతున్న భక్తజనం
  • బోనాలు, పట్నాలతో ఆధ్యాత్మిక శోభ
  • శివసత్తుల పూనకాలు, ఢమరుక నాదాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగుతున్న ఆలయ ప్రాంగణం
  • నేడు మకర సంక్రాంతి సందర్భంగా మహానివేదన 

ఐనవోలు, జనవరి 13 : ‘ఐనవోలు మల్లన్నా శత కోటి దండాలు’..‘కోరిన కోర్కెలు తీర్చి మ్మమేలు మా తండ్రికి శతకోటి దండాలు..’ కోరికలు నెరవేరితే కోడెలు కడుతం’.. ‘పాడిపంటలు పండి పిల్లా జెల్లా సల్లంగ ఉంటే పట్నాలు వేస్తాం..’ ‘గండాలు తీరితే గండా దీపం పెడుతం’.. ‘అందరం సల్లంగుంటే శావ తీస్తం’.. అంటూ భక్తకోటి ప్రణమిల్లుతున్నది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలులో మల్లికార్జునస్వామి జాతర బుధవారం నుంచి అంగరంగవైభవంగా ప్రారంభం కాగా, తొలిరోజు పట్నాలు, బోనాలతో ఆలయ ప్రాగణమంతా సందడిగా మారింది. శివసత్తుల పూనకాలు.. డప్పుల మోతలు.. ఢమరుక నాదాలతో ఆలయం మార్మోగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రచారం కల్పించడంతో పాటు భారీ ఏర్పాట్లు చేసింది. దీంతో వేలాదిగా భక్తజనం తరలివస్తున్నది. ఉదయం నుంచి దర్శనానికి మూడు, నాలుగు గంటల సమయం పట్టింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పడమర వైపు ఉన్న ఎల్లమ్మ ఆలయంలో బోనాలు సమర్పించారు. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌, వికలాంగుల సంక్షేమ సంఘం చైర్మన్‌ వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మధుమతి, ఆలయ కమిటీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు, సీఐ పుల్యాల కిషన్‌, ఎస్‌ఐ నర్సింహారావు, వైస్‌ ఎంపీపీ తంపుల మోహన్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ చందర్‌రావు, సర్పంచ్‌ జన్ను కుమారస్వామి, ఉప సర్పంచ్‌ సతీశ్‌కుమార్‌ పాల్తొన్నారు.


logo