కొత్తకొండ వీరన్న కోటి దండాలు

- జాతరకు పోటెత్తిన భక్తజనం
- కుమ్మరిబోనంతో ప్రధాన ఘట్టం ప్రారంభం
- వైభవంగా చండీయాగం
- వేలాదిగా తరలివచ్చిన భక్తులు
- దర్శించుకున్న మంత్రి ఈటల, ఎమ్మెల్యేలు
- నేడు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షిణ
నెత్తిన కుమ్మరి బోనాలు.. డప్పుచప్పుళ్ల నడుమ శివసత్తుల నృత్యాలు.. ఖడ్గాలతో వీరశైవుల విన్యాసాలు.. వాటి వెనుక ఎడ్లబండ్ల రథాలు.. ఇలా జాతరలో సంప్రదాయరీతిలో జరిగే ఉత్సవానికి అశేషంగా తరలివచ్చిన భక్తజనంతో కొత్తకొండ పోటెత్తింది. ‘కోరమీసాల కొత్తకొండ వీరన్నా.. నీకు కోటి దండాలు..’ అంటూ వీరభద్రుడి నామస్మరణతో ప్రాంతమంతా మార్మోగింది. బుధవారం కుమ్మరిబోనంతో ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ప్రారంభం కాగా చండీయాగం, సూర్యయంత్రస్థాపన వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ గండాలు తొలగిపోవాలని కోరమీసాలు సమర్పించారు.
- జాతరకు పోటెత్తిన భక్తజనం
- కుమ్మరిబోనంతో ప్రధాన ఘట్టం ప్రారంభం
- వైభవంగా చండీయాగం
- వేలాదిగా తరలివచ్చిన భక్తులు
- దర్శించుకున్న మంత్రి ఈటల, ఎమ్మెల్యేలు
- నేడు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షిణ
- ‘వృక్షప్రసాదం’ కొనసాగించాలి : మంత్రి ఈటల
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వృక్షప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి మొక్కలు అందజేశారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఏటా బ్రహ్మోత్సవాల్లో వృక్షప్రసాదం పేరిట మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమని ప్రశంసిస్తూ ఇలాగే కొనసాగించాలని సూచించారు. భక్తుల కోరిక మేరకు గుట్ట పైకి రోడ్డు వేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆలయంలో మంత్రి ఈటల, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు.
భీమదేవరపల్లి, జనవరి 13: కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చాలని గండదీపం వద్ద నూనె పోసి, కోరమీసాలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణ చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలోని దుకాణాలు, రంగులరాట్నాలు, సర్కస్, దుకాణ సముదాయాలన్ని రద్దీగా మారాయి. ఉత్సవాల్లో భాగంగా సూర్యయంత్ర స్థాపన కనుల పండువగా జరిగింది. యాగశాలలో ఉషాసమేత సూర్యభగవానుడి ఆరాధన, యంత్రస్థాపన, సూర్యనమస్కారాలు చేశారు. జాతర ప్రత్యేకాధికారిగా నియమితులైన రామాల సునీత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి పర్వదినాన ఎడ్లబండ్ల రథాలు ఆలయ ప్రదక్షిణలు చేస్తాయి.
మేరు సంఘం.. అన్నదానం
మేరు కుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అన్నదానం చేస్తామని నిర్వాహకులు మాడిశెట్టి కుమారస్వామి తెలిపారు. అంతకుముందు మేరు కులదైవం జఠగిరి శంకర దాసమయ్య చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, దండుగుల రాజ్యలక్ష్మి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏసీ రామాల సునీత, మేరు సంఘం మండలాధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్, కొత్తకొండ అధ్యక్షులు మార్కెట్ కుమారస్వామి, నోముల శ్రీనివాస్, అన్నదాతలు నరేశ్, హరిచందన పాల్గొన్నారు.
కుమ్మరిబోనంతో మొదలు..
ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజున కడిపికొండకు చెందిన కుమ్మరి వంశస్థులు ఆలయ సమీపంలో కుమ్మరిబోనం వేశారు. ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. బోనం నెత్తిన పెట్టుకొని ఆలయానికి వస్తుండగా డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తులు నృత్యాలు చేశారు. వీరశైవులు ఖడ్గాలతో విన్యాసాలు చేయగా ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనంతో కుమ్మరి వంశస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
తాజావార్తలు
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ